Begin typing your search above and press return to search.
అరె చరణ్ సైరాని అలా మిస్సయ్యాడా ?
By: Tupaki Desk | 24 Aug 2019 5:19 AM GMTమెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ తో పాటు మేకింగ్ వీడియో ఓ రేంజ్ లో ఆన్ లైన్ లో రచ్చ చేయడంతో మెగా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ధీమాతో ఉన్నారు. ప్రమోషన్ కూడా మెల్లగా వేగం పెంచుతున్నారు. చిరంజీవి చరణ్ లు ప్రత్యేకంగా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తన మనసులో భావాలను పంచుకుంటున్నారు.
ఇందులో భాగంగానే ఒక ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. తొలుత స్క్రిప్ట్ అనుకున్నప్పుడు సైరాలో ఇంటర్వెల్ బ్లాక్ కు ముందు షేర్ ఖాన్ అనే పాత్ర రాసుకున్నారట. చిన్న రోలే అయినప్పటికీ చాలా కీలకమైన మలుపుకు కారణమయ్యేది కావడంతో అది రామ్ చరణ్ తో చేయించాలని సూరి ప్లాన్. కానీ ఏవో కారణాల అది తర్వాత తొలగించారు. షూట్ చేయకుండానే స్క్రిప్ట్ లో నుంచి తీసేయాల్సి వచ్చిందట. సో అలా మెగా ఫాన్స్ మరోసారి మెగా కలయికను మిస్ అయినట్టే.
గతంలో ఈ ఇద్దరి కాంబో మగధీర - బ్రూస్ లీ - ఖైదీ నెంబర్ 150లలో కనిపించింది కాని అది కేవలం క్యామియోల వరకే పరిమితమయ్యింది. ఇప్పుడు సైరాతో మరోసారి ఆ మేజిక్ ని చూసే అవకాశం కోల్పోవడం అంటే అభిమానులకు కొంత అయ్యో అనిపించే సందర్భమే. ఎలాగూ నీహారిక ఓ రెండు నిముషాలు చేసేసింది కాబట్టి అదే తరహాలో ఏదైనా చిన్న పవర్ ఫుల్ రోల్ చరణ్ కు సెట్ చేసుకుంటే బాగుండేది కానీ అన్ని అలోచించి నిర్ణయాలు తీసుకునే చిరంజీవి ఇప్పుడీ షేర్ ఖాన్ పాత్రను వద్దనుకున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది