Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ చరణ్ ను వదిలేశాడా?
By: Tupaki Desk | 12 Dec 2015 10:42 AM GMT‘బ్రూస్ లీ’ సినిమా విడుదలకు ముందు ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో పిచ్చ క్లారిటీతో ఉన్నాడు రామ్ చరణ్. ముందు ‘తనీ ఒరువన్’ రీమేక్ చేద్దామని.. ఆ తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా మొదలుపెడదామని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. కానీ ‘బ్రూస్ లీ’ ఫలితం చూశాక అతడి ఆలోచలన్నీ మారిపోయాయి. ముందు కమిట్మెంట్ ఇచ్చిన సినిమా విషయంలో అనుమానంగా చూస్తున్నాడు చరణ్. ఇప్పటికే ‘తనీ ఒరువన్’ విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ఒరిజినల్ కు కట్టుబడాలా? మార్పులేమైనా చేయాలా? అనే విషయంలో సందిగ్ధత నడుస్తోందంటున్నారు. ఓ దశలో ఈ సినిమా వదిలేద్దామా అన్న ఆలోచన కూడా వచ్చిందట. ఐతే చిరు సూచన మేరకు ఈ సినిమా చేయాలని.. అది కూడా ఒరిజినల్ ను యథాతథంగా తీయాలని ఫిక్సయ్యారట.
ఆ సంగతలా వదిలేస్తే గౌతమ్ మీనన్ సినిమా విషయంలో మాత్రం చరణ్ ఏ సంగతీ తేల్చకపోవడంతో ఆ డైరెక్టర్ విసుగెత్తిపోయినట్లు సమాచారం. కథ అంతా నరేట్ చేసి.. ఓకే అనిపించుకున్నాక సినిమా ఎప్పుడు మొదలెట్టే విషయం చరణ్ తేల్చకపోవడంతో గౌతమ్.. మెగా హీరోకు టాటా చెప్పేద్దామని చూస్తున్నాడట. ఆయన అనుకున్నదాని ప్రకారమైతే ‘తనీ ఒరువన్’ రీమేక్ ఈపాటికి మొదలై ఉండాలి. ఇంకో రెండు మూడు నెలలకే చరణ్ ఫ్రీ అవ్వాలి. కానీ పరిస్థితులు అలా లేవు. చరణ్ ఫ్రీ అవడానికి చాలా టైం పట్టేట్లుంది. మరోవైపు కథ విషయంలో కూడా ఇద్దరికీ భిన్నాభిప్రాయాలున్నాయట. అందుకే చరణ్ సంగతి వదిలేసి.. తమిళంలో జయం రవితో సినిమా మొదలుపెట్టేయాలని.. ఆ తర్వాత ఇంకో తెలుగు హీరో ఎవరైనా దొరికితే తెలుగులోనూ చేద్దామని ఫిక్సయ్యాడట గౌతమ్.