Begin typing your search above and press return to search.
ఫ్లాప్ డైరెక్టర్లకే చరణ్ ఛాన్సులిస్తాడా?
By: Tupaki Desk | 5 Sep 2015 5:27 AM GMTడైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంలో ఒక్కో స్టార్ హీరోదీ ఒక్కో స్టయిల్. సాధారణంగా హిట్లిచ్చిన దర్శకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లెక్క మాత్రం వేరేగా ఉంటోంది. ఫ్లాప్ డైరెక్టర్లకి సినిమాలిచ్చి... బంపర్ హిట్లు కొట్టేస్తున్నాడు. ఒక్కసారి తప్ప చెర్రీ లెక్క ఎప్పుడూ తప్పకపోవడం హైలైట్.
ఇప్పుడు శ్రీనువైట్లతో బ్రూస్ లీ చేస్తున్నాడు చరణ్. దీనికి ముందు వైట్ల చేసిన ఆగడు పెద్ద డిజాస్టర్. తర్వాత సురేందర్ రెడ్డి సినిమా కన్ ఫాం అని తెలుస్తోంది. కిక్2తో సూపర్ ఫ్లాప్ రీసెంట్ గానే ఇచ్చాడు సూరి. ఇవే కాదు... ఇంతకు ముందు కూడా చెర్రీ లెక్కలు ఇలాగే ఉన్నాయి. కృష్ణవంశీతో గోవిందుడు అందరివాడేలే అన్నాడు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ కయితే పైసా, మొగుడు, మహాత్మ.. అబ్బో ఫ్లాపుల లెక్క పెద్దదే ఉంది. తుఫాన్ అంటూ తెలుగులోను, జంజీర్ అంటూ హిందీలోనూ బైలింగ్యువల్ మూవీ చేశాడు అపూర్వ లఖియాతో. ఈ తుఫాన్ తీయకముందు మిషన్ ఇస్తాంబుల్ అనే పట్టుమని పది కోట్లు రాబట్టలేకపోయిన గ్రేటెస్ట్ ప్లాప్ తీసిన రికార్డ్ ఉంది లఖియాకి.
చెర్రీ ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకి ఆఫర్లిచ్చే కథ ఇక్కడితో అయిపోలేదు. నాయక్ అంటూ వివి వినాయక్ తో చెర్రీ సక్సెస్ కొట్టాడు కానీ.. అంతకుముందు వినాయక్ తీసిన సినిమా పేరు బద్రీనాధ్. ఇంకో అడుగు వెనక్కెళితే.. రచ్చ అంటూ బెట్టింగ్ రాజ్ గా మాంచి హిట్ కొట్టాడు చరణ్. దీనికి ముందు వరుణ్ సందేశ్ తో ఏమైంది ఈవేళ అనే ఫ్లాప్ తీసిన సంపత్ నందియే.. రచ్చకు డైరెక్టర్.
ఏమైనా ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్సులిచ్చి... వాళ్లలో ఉన్న కసిని బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు చరణ్. అయినా సరే... ఫ్లాప్ భారంతో ఉన్న డైరెక్టర్లకి ఆఫర్ ఇవ్వడమంటే రిస్కే. ఈ విషయంలో మెగా పవర్ స్టార్ ని అభినందించాల్సిందే.