Begin typing your search above and press return to search.
వైరల్: 1930's లుక్ లో మెగా హీరో..!
By: Tupaki Desk | 18 Feb 2022 4:32 AM GMTక్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే. జక్కన్న అత్యతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో దాదాపు 14 బారతీయ భాషల్లో కనీ వినీ ఎరుగని రీతిలో విడుదల కాబోతోంది. గత కొంత కాలంగా రిలీజ్ విషయంలో తర్జన భర్జన పడుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకు `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ని మార్చి 25న ఫైనల్ చేసేశారు.
దీంతో ఇద్దరు హీరోలు తమ తదుపరి ప్రాజెక్ట లపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ .. కొరటాల శివతో చేయనున్న తన 30 వ ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టారు.
ఇదే తరహాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి వెళ్లి పోయాడు. శంకర్ తో చరణ్ ఓ భారీ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. RC15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని రాజమండ్రిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్కడ హెవీ క్రౌడ్ మధ్య భారీ స్థాయిలో కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. చరణ్ ఇందులో టూ డైమెన్షన్స్ వున్న పాత్రల్లో కనిపించబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
ఇందులో ఒక పాత్ర పొలిటిక్ లీడర్ గానూ.. మరో పాత్ర పవర్ ఫుల్ గా సాగే ప్రభుత్వ అధికారిగానూ వుంటుందని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్.. రామ్ చరణ్ టెర్రిఫిక్ లుక్ అంటూ ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. డ్యుయల్ రోల్ లో రామ్ చరణ్ కనిపించనున్న ఈ మూవీలోని తండ్రి పాత్రకు సంబంధించిన స్టిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. తండ్రి పాత్రకు సంబంధించిన వెర్షన్ అంతా 1930`s నేపథ్యంలో వుంటుందని చెబుతున్నారు.
ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ అంటూ ఓ ఫొటో తాజాగా బయటికి వచ్చింది. కోర మీసాలతో మ్యాన్లీగా ఈ లుక్ లో చరణ్ కనిపిస్తున్నారు. పంచెకట్టు.. పైన వైట్ టీషర్ట్ వేసుకుని చేతిలో బుల్లి డాగ్ ని పట్టుకుని చరణ్ కనిపిస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. పక్కాగా చెప్పాలంటే `ఆర్ ఆర్ ఆర్` లో అల్లూరి సీతారామరాజు లుక్ ని పోలి వుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే ఇది నిజంగానే శంకర్ RC15 కి సంబంధించిన స్టిల్లేనా అన్నది క్లారిటీ లేదు. కానీ సినిమాలో మాత్రం చరణ్ కు సంబంధించిన ఓ పాత్ర మాత్రం 1930`s నేపథ్యంలో సాగుతుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. చరణ్ లుక్ మ్యాన్లీగా వుండటంతో లుక్ అదిరిందంటూ నెట్టింట అభిమానులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
సమకాలీన రాజకీయాలపై శంకర్ సంధిస్తున్న సెటైరికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీలో అంజలి - జయరామ్ - సునిల్ - శ్రీకాంత్ - నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రధాన విలన్ గా దర్శకుడు ఎస్. జె . సూర్య నటిస్తున్నారు.