Begin typing your search above and press return to search.

మహర్షి తర్వాత చరణ్ తోనేనా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:35 PM IST
మహర్షి తర్వాత చరణ్ తోనేనా?
X
ప్రస్తుతం మహేష్ బాబు 25వ సినిమా షూటింగ్ లో తలమునకలై ఉన్న దర్శకుడు వంశీ పైడిపల్లి పెద్ద భారాన్నే మోస్తున్నాడు. మొన్న వదిలిన చిన్న టీజర్ బిట్ కే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. మామూలుగానే యంగ్ గా కనిపించే ప్రిన్స్ ని ఇంకో పదేళ్లు వెనక్కు తీసుకెళ్ళేలా వంశీ చేయించిన మేజిక్ కి ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఏప్రిల్ 5 విడుదలకు ఇంకా చాలా టైం ఉండటంతో ప్రస్తుతం మహర్షి తర్వాత చేయబోయే కొత్త సినిమా గురించి చెప్పే పొజిషన్ లో వంశీ లేడు. తన ధ్యాస అంతా మహర్షి మీదే ఉంది. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఇద్దరి కాంబోలో గతంలో ఎవడు వచ్చింది. చెర్రీని పర్ఫెక్ట్ డ్యూయల్ రోల్ లో మాస్ అవతారంతో వంశీ చూపించిన తీరుకు వసూళ్లు బాగా వచ్చాయి. తనను వంశీ చూపించిన విధానం బాగా నచ్చిందని చరణ్ పలుమార్లు అన్నాడు కూడా.

సో రెండోసారి ఈ కాంబో టై అప్ అయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇక్కడ కొన్ని చిక్కుముళ్లు ఉన్నాయి. రామ్ చరణ్ బోయపాటి శీను సినిమా పూర్తి చేసాక జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. ఎంత లేదన్నా ఏడాది దాకా బయటికి రావడం కష్టమే. మార్చ్ కంతా మహర్షి ఫినిష్ చేసుంటాడు కాబట్టి ఆ తర్వాత వంశీ ఫ్రీ అవుతాడు కానీ చరణ్ కాదు. మరి చరణ్ వచ్చే దాకా మహేష్ కోసం వెయిట్ చేసినట్టు వేచి ఉంటాడా లేక పివిపి సంస్థకు ఎలాగూ ఒప్పందం ప్రకారం సినిమా చేయాలి కాబట్టి వేరే హీరోకు షిఫ్ట్ అవుతాడా అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. కానీ ఇద్దరి మనసులో కలిసి చేయాలనీ ఉందని పలుమార్లు పార్టీల్లో కలుసుకున్నప్పుడు దీని గురించి చర్చలు జరిగాయని సన్నిహితుల నుంచి టాక్. మరి సెట్ అయితే బాగానే ఉంటుంది కానీ టైం అయితే బాగా పట్టేలా ఉంది.