Begin typing your search above and press return to search.
చరణ్ మొహమాటం పక్కన పెట్టేశాడు
By: Tupaki Desk | 4 July 2017 7:08 AM GMTతాను ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమా చేయడానికి మణిరత్నం ఇచ్చిన సలహానే కారణమని ఆ మధ్య చెప్పాడు రామ్ చరణ్. దీన్ని బట్టే చరణ్ మీద మణి ఎంత ప్రభావం చూపించాడో.. వాళ్లిద్దరి మధ్య ఎంత డీప్ డిస్కషన్స్ జరిగాయో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా మణిరత్నం సినిమాలో నటించాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప ఏ నటుడికీ తన సినిమాల్లో అవకాశమివ్వరు మణి. పెద్ద పెద్ద స్టార్లు సైతం ఆయనతో కెరీర్ లో ఒక్క సినిమా చేయాలని తపిస్తుంటారు. అదీ మణిరత్నానికి ఉన్న గుర్తింపు. మరి నటుడిగా గొప్ప పేరేమీ సంపాదించని రామ్ చరణ్ లో మణిరత్నం ఏం ప్రత్యేకతను గమనించాడో ఏంటో.. అతడితో సినిమా చేయాలని అనుకున్నాడు.
ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. సరైన టైమింగ్ కుదర్లేదు. సినిమా వాయిదా పడింది. ఐతే మణిరత్నం దర్శకత్వంలో నటించడాన్ని చరణ్ కూడా ప్రత్యేకంగానే భావిస్తాడనడంలో సందేహం లేదు. కానీ ఆ కోరిక తీర్చుకోవడం కోసం కెరీర్ ను ప్రమాదంలో పడేసుకుంటావా అని సన్నిహితులు చరణ్ ను గట్టిగా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. మణిరత్నం గత పదేళ్లలో ఎలాంటి సినిమాలు అందించాడో తెలిసిందే. ‘ఓకే బంగారం’ మినహాయిస్తే.. విలన్.. కడలి.. చెలియా.. ఇలా ఒకదాన్ని మించిన డిజాస్టర్ ఇంకోటి. ఆయన సామాన్య ప్రేక్షకులతో పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారన్న విమర్శలు ‘చెలియా’తో తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మణి ఆసక్తిగానే ఉన్నప్పటికీ.. చరణే ఆయనతో సినిమా చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. చాలా స్ట్రగుల్ తర్వాత చరణ్ ‘ధృవ’తో కాస్త నిలదొక్కుకున్నాడు. అయినప్పటికీ ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. ప్రభాస్ లాంటి సమకాలీన స్టార్లు ఇంతింతై అని ఎదిగిపోతున్న నేపథ్యంలో చరణ్ తన రేంజిని పెంచుకునే సినిమాలు చేయాలి తప్ప.. మణిరత్నంతో ప్రయోగాలు చేసే పరిస్థితి లేదు. అందుకే మణిరత్నంతో పనిచేసే అరుదైన అవకాశం కంటే.. సక్సెస్ ముఖ్యమన్న భావనతో మొహమాటాలు పక్కన పెట్టేసి ఆయనకు నో చెప్పేసినట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/