Begin typing your search above and press return to search.

ఇల్లీతో కిక్ రాదు అంటున్న చెర్రీ

By:  Tupaki Desk   |   2 Feb 2016 1:30 PM GMT
ఇల్లీతో కిక్ రాదు అంటున్న చెర్రీ
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొన్ని రోజుల్లో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు. ఈ నెల రెండో వారంలో తని ఒరువన్ ప్రారంభానికి ముహూర్తం పెట్టేసుకున్నాడు రామ్ చరణ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. శృతిహాసన్ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారని అనుకున్నారు కానీ.. ఈ మూవీలో ఆ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు.

స్టోరీ - స్క్రీన్ ప్లే అంతా హీరో - విలన్ మధ్య మైండ్ గేమ్ తోనే సాగుతుంది. ఇందులో హీరోయిన్ అంటే కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం. అందుకే శృతి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. అందుకే ఇలియానాను హీరోయిన్ గా తీసుకుందామని డైరెక్టర్ సురేందర్ రెడ్డి - చెర్రీకి చెప్పాడట. తనతో కిక్ మూవీ చేసిన ఇల్లీ బేబీ ఈ గ్లామరస్ రోల్ కి బాగా యాప్ట్ అంటున్నాడు సూరి. కానీ ఓ ఫ్లాప్ కారణంగా జాగ్రత్త పడుతున్న రామ్ చరణ్.. హీరోయిన్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేడంటున్నారు. అంతగా ఫామ్ లో లేని ఇలియాని బదులు, కొత్త హీరోయిన్ ని ప్రిఫర్ చేద్దామని సూచించాడట.

నిజానికి ఇలియానా - రామ్ చరణ్ లు మంచి ఫ్రెండ్స్. అయినా సరే మూవీ విషయంలో మాత్రం ఫ్రెండ్ షిప్ లాంటి వేమీ పట్టించుకోకూడదని చెర్రీ ఫీలింగ్. మరో పదిహేను రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేసేయాలని అనుకుంటున్నా.. ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాకపోవడం కొంత ఇబ్బంది పెట్టే విషయమే. మరి చరణ్ చెప్పిన మాట సూరి వింటాడో.. లేక డైరెక్టర్ ఆప్షన్ కే హీరో వదిలేస్తాడో ఇంకా తేలలేదు.