Begin typing your search above and press return to search.

ట్రిప్‌ నుండి వచ్చాక ఫైనల్‌ చేస్తాడు

By:  Tupaki Desk   |   7 Nov 2015 3:30 PM GMT
ట్రిప్‌ నుండి వచ్చాక ఫైనల్‌ చేస్తాడు
X
రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో విలన్ ఎవరు ? ఇదేం అంత ఈజీగా తేలేట్లు కనిపించడం లేదు. తని ఒరువన్ ని రీమేక్ చేయాలని డిసైడ్ అయిన చరణ్.. విలన్ సంగతి మాత్రం ఓ పట్టాన తేల్చడం లేదు. ఈ మూవీలో హీరోకి సమానంగా, పోటాపోటీగా విలన్ రోల్ ఉంటుంది. అందుకే ఈ కేరక్టర్ కోసం కరెక్ట్ యాక్టర్ ని ఫైనల్ చేసేందుకు చెర్రీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నిజానికి ఒరిజినల్ లో అరవింద్ స్వామినే విలన్ రోల్ కి ఫైనల్ చేసేశారని గతంలో వార్తలొచ్చాయి. ఈ మేరకు ఆయనతో మాట్లాడి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. అయితే.. ప్రస్తుతం ఫారిన్ ట్రిప్ లో ఉన్న చెర్రీ మాత్రం.. తను వచ్చేదాకా ఏ విషయాన్నీ ఫైనల్ అని అనౌన్స్ చేయద్దని చెప్పాడట. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోని విలన్ గా ఒప్పించాలన్నది చరణ్ ఆలోచన. నాగార్జున - వెంకటేష్ లలో ఎవరో ఒకరితో ఈ పాత్ర చేయించాలని చూస్తున్నాడు రామ్ చరణ్.

మంచి స్టోరీతో ఓ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయాన్నది చరణ్ ఆలోచన. వారి నుంచి ఇప్పటివరకూ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే.. యూనిట్ వర్గాలు అరవింద్ స్వామిని అప్రోచ్ అయ్యాయని చెప్పుకుంటున్నారు. అయితే తను తిరిగొచ్చాక.. వెంకీ - నాగ్ లతో డైరెక్ట్ గా మాట్లాడి.. ఫైనల్ చేస్తానని చరణ్ అనడంతో.. మళ్లీ విలన్ రోల్ ఎవరు చేస్తారనే విషయంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.