Begin typing your search above and press return to search.
చరణ్..తారక్ పై చిత్తూరు కుర్రాడి అభిమానం!
By: Tupaki Desk | 22 March 2022 5:55 AM GMTపాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ లో రిలీజ్ ఫీవర్ కొనసాగుతుంది. ఇద్దరు బిగ్ స్టార్లు రామ్ చరణ్--తారక్ ఒకే ప్రేమ్ లో కనిపించడంతో ఎవరు హైలైట్ అవుతారు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తుంది. ఓవైపు రెండు పాత్రలు సమానంగా ధీటుగా సాగుతాయని చెబుతున్నా అభిమానం అనేది ఆ బ్యాలెన్స్ ని ఒప్పుకోవడం లేదు. ఎవరి అంచనాలు..ఎవరి ఊహాగానాలు వాళ్లకున్నాయి. వాటన్నింటికి తెరపడాలంటే మార్చి 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.
బెనిఫిట్ షోలతో అన్నింటికి ఓ సమాధానం దొరుకుతుంది. ఇక రిలీజ్ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాలు సహా అమెరికాలోనూ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. స్టార్లపై అభిమానాన్ని వైవిథ్యంగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకి చెందిన ఓ అభిమాని ఆల్ ది బెస్ట్ ని వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేసాడు. రామ్ చరణ్-ఎన్టీఆర్ బొమ్మలని టీకప్పులతో అమర్చి అభిమానం చాటుకున్నాడు. గుడుపల్లి మండలం చిన్నపర్తికి చెందిన పురుషోత్తం చిన్ననాటి నుంచి క్రియేటివ్ ఫెలో.
గతంలో ఉప్పుతో బొమ్మలు వేసేవాడు. అయితే ఈసారి చరణ్-తారక్ ల్ ని వైవిధ్యంగా చూపించాలని ఇప్పటివరకూ దేశంలో ఎవరు చేయని విధంగా 15వేల టీకప్పుల్ని ఉపయోగించి ఇద్దరి స్టార్లను తనదైన శైలిలో ఆవిష్కరించాడు. అందుకు ఆరు రోజుల పాటు సమయం పట్టిందిట. నిజంగా పురుషోత్తం ప్రతిభని మొచ్చుకోవాల్సిందే. అచ్చంగా ఇద్దరి స్టార్లని టీ కప్పులతో దించేసాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు రెండు నెట్టింట వైరల్ గా మారాయి.
అటు అమెరికాలోనూ `ఆర్ ఆర్ ఆర్` మేనియా కొనసాగుతుంది. ఎన్టీఆర్ అభిమానులు `జై ఎన్టీఆర్`..`ఆర్ ఆర్ ఆర్` అనే అక్షరాల్ని కార్లతో రూపొందించారు. అందుకోసం తారక్ అభిమానులు ఎంతగా శ్రమపడ్డారో దానికి సంబంధించిన వీడియోని కూడా పోస్ట్ చేసారు. అలాగే ఆస్ర్టేలియాలోని మెల్ బోర్న్ లో తారక్ అభిమానులు 70 కార్లతో ర్యాలీని సైతం నిర్వహించారు. ఈ ర్యాలీ కోసం అభిమానులు ఖరీదైన కార్లను వినియోగించడం విశేషం.
ఇటీవలే కర్ణాటకలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ అభిమాని ఒకరు నేరుగా వేదికపైకి దూసుకొచ్చే ప్రయత్నంచేసిన సంగతి తెలిసిందే. అక్కడ యంగ్ టైగర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తారక్ అభిమాని ఒకరు ఆలింగనం కోసం ఆర కమైన ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రం మార్చి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున బుకింగ్స్ జరుగుతున్నాయి.
`బాహుబలి` వసూళ్ల టార్గెట్ గా `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ అవుతుంది. మార్కెట్లో గ్లోబల్ మూవీగా నిలుస్తుందన్న అంచనాలున్నాయి. మరి వాటిని `ఆర్ ఆర్ ఆర్` ఎంత వరకూ నిరూపిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి ఎస్ .ఎస్ . రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో దానయ్య నిర్మించారు.