Begin typing your search above and press return to search.
డాడ్ కి రెమ్యునరేషన్ ఎంత?
By: Tupaki Desk | 9 Jan 2019 1:30 AM GMTపుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...! అన్నాడు సుమతీ శతకకారుడు. తనయుడు రామ్ చరణ్ విషయంలో తండ్రి చిరంజీవి ప్రస్తుతం ఆ ఆనందానుభూతుల్ని ఆస్వాధిస్తున్నారు. ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా చరణ్ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అతడు నటించిన `వినయ విధేయ రామ` బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందన్న అంచనాలేర్పడ్డాయి. దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా అంతే మొత్తం షేర్ వసూలు చేస్తుందని, మాస్ లో దూసుకెళుతుందని టీమ్ అంచనా వేస్తోంది.
విధేయ రాముడు ఈ సినిమా కోసం దానయ్య నుంచి 20కోట్లు పైగానే పారితోషికం అందుకున్నాడని ప్రచారమవుతోంది. అదంతా సరే.. చరణ్ అంత పారితోషికం అందుకుంటున్నాడు కదా? డాడ్ చిరంజీవికి `సైరా` నిర్మాతగా ఎంత పారితోషికం ముట్టజెబుతున్నాడు. సురేఖ కొణిదెల సమర్పణలో చరణ్ నిర్మాతగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థ నిర్మిస్తున్న `సైరా` చిత్రంలో నటించినందుకు చిరుకు ఎంత పారితోషికం ఇస్తున్నారు? ఇదే ప్రశ్న తననే అడిగేస్తే ఆసక్తికర సమాధానం చెప్పారు.
``డాడ్ కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇస్తున్నాను. వేరొకరు ఇంతవరకూ ఇవ్వనంత పెద్ద రెమ్యునరేషన్ అందుకుంటున్నారు`` అని చెప్పారు చరణ్. సైరా చిత్రం కోసం ఏకంగా 200కోట్లు పైగా బడ్జెట్ కేటాయించామని, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రమిదని చరణ్ తెలిపారు. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ సాగుతుందని అన్నారు. బాలీవుడ్ వైపు ఆలోచిస్తున్నారా? అన్న ప్రశ్నకు చరణ్ మాట్లాడుతూ-``ప్రస్తుతం తెలుగు సినిమాలతో హ్యాపీగా ఉన్నాను. బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదు. సైరా చిత్రాన్ని కేవలం దక్షిణాది వరకే విడుదల చేయాలనుకుంటున్నాం. బాలీవుడ్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఎక్కువ ఆశ పడటం లేదు`` అని అన్నారు.