Begin typing your search above and press return to search.

చెర్రీ వద్దంటే.. వీళ్లు గొడవలు పెట్టేలా ఉన్నారు

By:  Tupaki Desk   |   25 May 2018 6:05 AM GMT
చెర్రీ వద్దంటే.. వీళ్లు గొడవలు పెట్టేలా ఉన్నారు
X

రామ్ చరణ్ రీసంట్ గా ప్రెస్ తో మాట్లాడుతూ కలెక్షన్స్.. నెంబర్ల అంశంపై మాట్లాడాడు. ఇకపై తాను నటించే సినిమాలు మాత్రమే కాకుండా.. తాను నిర్మించే సినిమాల విషయంలో కూడా ఎక్కడా కలెక్షన్స్ నెంబర్లను పోస్టర్లపై వేయనని తేల్చి చెప్పాడు చరణ్.

ఇదంతా భరత్ అనే నేను.. నా పేరు సూర్యతో పాటు రంగస్థలం మూవీ కలెక్షన్స్ కు సంబంధించిన అంకెలతో పోస్టర్లు వేయడం.. వాటిపై ఆరోపణలు రావడమే కారణంనే చరణ్ చెప్పాడని చెప్పవచ్చు. ఓ రకంగా చూస్తే.. ఇతరులకు కూడా ఆదర్శవంతంగా ఉండేలా ఓ మంచి నిర్ణయాన్ని రామ్ చరణ్ ప్రకటించాడు. తమ అందరి మధ్య ఫ్రెండ్లీ వాతావరణం ఉందని.. ఇలాంటి వాటి కారణంగా ఫ్యాన్స్ మధ్య గొడవలు రాకుండా ఉండేందుకు రామ్ చరణ్‌ అలా డెసిషన్ తీసుకున్నాడని అర్ధమవుతుంది. చరణ్ తను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగానే చెప్పినా.. దీనిపై మళ్లీ పెడార్ధాలు తీయడం కొందరు మొదలుపెట్టారు.

మహేష్‌ మీద సెటైర్.. బన్నీ మీద సెటైర్ అంటూ హంగామా చేస్తున్నారు. స్వయంగా స్టార్ హీరోనే ఓ మంచి నిర్ణయం తీసుకుని.. ఎవరూ గొడవలు పడవద్దని.. ఎలాంటి వివాదాలు వద్దని చెబుతుంటే.. మళ్లీ విపరీతార్ధాలు తీసి.. గొడవలు పెట్టడం కరక్టేనా? అంటూ జనాలు నిలదీస్తున్నారు. ఎవరికైనా సరే ఓ విషయం చెప్పేటప్పుడు.. చెప్పేవాళ్లకు విజ్ఞత లేకపోయినా పర్లేదు కానీ.. వివాదం సృష్టించాలనే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదన్నది వారి వాదన.