Begin typing your search above and press return to search.
సైరాకు ఇవి హెచ్చరికలే!
By: Tupaki Desk | 17 Jan 2019 10:57 AM GMTఒకప్పుడు స్టార్ ఇమేజ్ ల మీద సినిమాలు వంద రోజులు తేలికగా ఆడేవి. థియేటర్ తప్ప ఎంటర్ టైన్మెంట్ కు వేరే ఆప్షన్ లేకపోవడంతో యావరేజ్ కంటెంట్ ఉన్నా చాలు హండ్రెడ్ డేస్ పక్కా. కానీ రోజులు మారాయి. కంటెంట్ కింగ్ గా మారిపోయింది. చాలా బాగుంది అని టాక్ వస్తే తప్ప జనం సినిమా హాల్ దాకా రావడం లేదు. కుటుంబంతో సినిమా చూడాలంటే వందల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆచితూచి ఎంచుకుంటున్నారు. అందుకే హీరో ఎవరైనా విషయం లేకపోతే తేడా కొట్టక తప్పదు.
రజనీకాంత్ అంతటి హీరోకే తెలుగులో కమర్షియల్ హిట్ దక్కి ఎన్నేళ్లు అయ్యిందో టక్కున చెప్పడం కష్టం. 2.0 సైతం కమర్షియల్ ఫెయిల్యూరే. ఇప్పుడు సంక్రాంతి సీజన్ అయ్యాక అందరి చర్చ వినయ విధేయ రామ డిజాస్టర్ మీదకు మళ్లుతోంది. 90 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న దీనికి మొత్తంగా 50 కోట్లు దాటడమే గొప్ప అనేలా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారు 150 కోట్లకు బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి మీద దీని ప్రభావం ఉంటుందా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే మెగాస్టార్ చిరంజీవిగా ఆయనకు ఎంత డిమాండ్ ఉన్నా డిస్ట్రిబ్యూటర్లు మార్కెట్ ని మించి పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. పైగా ఈ రెండేళ్ల కాలంలో రంగస్థలం మినహాయించి మెగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతులు కాలెలా చేశాయి.
అందుకే సైరా మీద బయ్యర్లు ఎంత పెట్టేందుకైనా వెనుకాడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. చరణ్ కూడా నిర్మాతగా సైరాకు సంబంధించి చాలా లెక్కలు సరిచూసుకోవాలి. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ ఉన్నప్పటికీ రిస్క్ కి భయపడకుండా కొనేందుకు వచ్చేవాళ్లను ఒడిసి పట్టుకోవాలి. ఈ ఏడాదే విడుదల చేసే ఆలోచన ఉంది కాబట్టి సైరా వ్యాపార లావాదేవీలు ఇప్పటి నుంచే వేగవంతం చేయాలి. దానికి తోడు ప్రమోషన్ విషయంలో కూడా అలెర్ట్ గా ఉండి హైప్ ను పెంచుకుంటూ పోవాలి. 2.0-వినయ విధేయ రామ లాంటి కమర్షియల్ ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా సైరాకు పాఠాలు నేర్పించేవే.