Begin typing your search above and press return to search.

సైరా గురించి చరణ్ సీరియస్?

By:  Tupaki Desk   |   3 July 2019 4:38 AM GMT
సైరా గురించి చరణ్ సీరియస్?
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహారెడ్డి ఇంకో మూడు నెలల్లో రాబోతున్నాడు. అక్టోబర్ 2 రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ ట్రేడ్ కు ఇప్పటికే పక్కా సమాచారం అందటంతో వాళ్ళ ఏర్పాట్లలో వాళ్లున్నారు. అయితే ఈ రేంజ్ లో రూపొందుతున్న మెగా మూవీ మీద ఆశించిన స్థాయిలో బజ్ రావడం లేదనే అసంతృప్తి ఇటు అభిమానుల్లోనూ అటు నిర్మాతగా ఉన్న చరణ్ లోనూ ఉందన్న చర్చ ఫిలిం నగర్ లో సాగుతోంది.

బాహుబలి తర్వాత అంత స్థాయి ఉన్న మూవీగా సైరా మీదే అంచనాలు ఉన్నాయి. కానీ దానికి తగ్గ ప్రమోషన్ కానీ హైప్ ని తెచ్చే ప్రయత్నాలు కానీ యూనిట్ చేయకపోవడం ఇప్పుడీ పరిస్థితికి దారి తీస్తోంది. అప్పుడప్పుడు ఇందులో నటించిన తారల పుట్టినరోజులును పురస్కరించుకుని ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసిన పెద్దగా ప్రయోజనం కలగలేదు. రామ్ చరణ్ ఒక పక్క ఆర్ ఆర్ ఆర్ తో బిజీ ఉన్నాడు. దాని షూటింగ్ లో కలిగిన గాయం వల్లే కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇకపై చాలా యాక్టివ్ గా మారితే తప్ప సైరా కు తగ్గ ప్రీ రిలీజ్ టాక్ రాదు. తెరవెనుక ప్రణాళికలు జరుగుతున్నాయని మరికొద్ది రోజుల్లో వాటిని అమలు పరుస్తారని ఇంకో టాక్ ఉంది. రంగస్థలం తర్వాత గొప్పగా చెప్పుకునే స్థాయిలో మెగా కాంపౌండ్ కు హిట్ దక్కలేదు. ఎఫ్2 ఉంది కానీ అది వెంకటేష్ ఖాతాలో వెళ్లిపోయింది. మరోవైపు పవన్ సినిమాలు చేసే ఉద్దేశంలో లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ చూపులూ సైరా మీదే ఉన్నాయి. ఇదేదో త్వరగా గుర్తించి చరణ్ ప్రమోషన్ మీద ఫోక్స్ పెడితే బెటర్