Begin typing your search above and press return to search.
బాలయ్యలా అంటే భయపడ్డాను! -చెర్రీ
By: Tupaki Desk | 5 Jan 2019 11:43 AM GMTడైలాగ్ చెప్పడంలో బాలయ్య తర్వాతే. నటసింహా పంచ్ పవర్ పెద్ద తెరపై ఆ రేంజులోనే వర్కవుటైంది. అభిమానులకు సంబరాలే సంబరాలు. అయితే బాలయ్య నోట పలకాల్సిన డైలాగుల్ని చరణ్ నోట పలించాల్సి వస్తే, అది ఫజిల్ లాంటిదే కదా? ఇదే సందేహం తనకు కూడా ఉండేదని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వినయ విధేయ రామ బోయపాటి మార్క్ చిత్రం. ఆయన సినిమాలో యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఎక్కువే ఉంటాయి. ఇలాంటి ప్రయత్నం నాకు కొత్త. ప్రేక్షకులు ఇలాంటి రఫ్ పాత్రల్ని ఇష్టపడుతుంటారు. భద్ర నుంచి బోయపాటి సినిమాలు ఇలానే ఓ ప్యాక్ లా ఉంటున్నాయి. వినయ విధేయ రామలో అలాంటి మసాలా దట్టించారు.
ఇక బోయపాటి సినిమాల్లో బాలయ్య గారు అలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పారు. మరి నేను అలాంటివి ఎలా చెప్పగలను? అనే సందేహం ప్రశ్నార్థకం ఉండేది. కానీ బోయపాటి నన్ను నమ్మి రాశారు. ఆయన ప్రకారం వెళ్లిపోయా.. నాపై నేను ఆధారపడలేదు.. అనీ చరణ్ అన్నారు.
మొత్తానికి బాలయ్య ట్రేడ్ మార్క్ డైలాగుల్ని చరణ్ చేత చెప్పించడంలో బోయపాటి పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ చిత్రంలో రామ్ కొ.ణి.దె.ల డైలాగ్ పెట్రోబాంబ్ లా పేలిన సంగతి తెలిసిందే. ఇంకా ఇందులో చాలానే ఈ టైపు పంచ్ లు ఉన్నాయి. డైలాగ్స్ తో ఓవైపు, భారీ యాక్షన్ తో మరోవైపు తెరపై దుమారం చూస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగుతుందేమో? మరో ఐదురోజులే .. జస్ట్ వెయిట్..