Begin typing your search above and press return to search.

విధేయ రాముడికి చివరి నిమిషంలో పెంచేశారు

By:  Tupaki Desk   |   10 Jan 2019 12:08 PM GMT
విధేయ రాముడికి చివరి నిమిషంలో పెంచేశారు
X
భారీ అంచనాల నడుమ రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుండి అదనపు షోలకు అనుమతి రావడంతో పాటు - ఏపీలో కూడా అదనపు షోలకు గ్రీన్‌ సిగ్నల్‌ దక్కింది. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్‌ రాజు - ఏపీలో యూవీ క్రియేషన్స్‌ వారు విడుదల చేస్తున్న కారణంగా థియేటర్ల సమస్యే లేకుండా విడుదల కాబోతుంది. రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఇంకొన్ని థియేటర్లను యాడ్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని 330 స్క్రీన్స్‌ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే విడుదల తేదీ దగ్గర పడ్డ సమయంలో ఈ థియేటర్ల సంఖ్యను మరింతగా పెంచారట. విడుదలైన మొదటి రోజు భారీ ఎత్తున ఈ చిత్రానికి థియేటర్లను దిల్‌ రాజు కేటాయించాడట. ఆ తర్వాత రోజు ‘ఎఫ్‌ 2’ విడుదల కాబోతున్న నేపథ్యంలో సాధ్యమైనంత ఎక్కువ థియేటర్లలో వినయ విధేయ రామను విడుదల చేసి ఓపెనింగ్స్‌ ను గుంజేసుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ల ప్లాన్‌ గా తెలుస్తోంది.

పేట మరియు ఎన్టీఆర్‌ చిత్రాలు అరకొర థియేటర్లతో ఇబ్బంది పడుతూ విడుదల అయ్యాయంటూ నందమూరి ఫ్యాన్స్‌ మరియు రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో రామ్‌ చరణ్‌ సినిమా ఎక్కువ ఎక్కువ థియేటర్లలో విడుదల చేస్తున్న నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్‌ ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ సంతోషంగా ఉన్నారు. ఒక్క కాకినాడలోనే అయిదు థియేటర్లలో మొదటి రోజు తెల్లవారుజామున 5 గంటల షోను మొదట ప్లాన్‌ చేశారు. కాని ఉన్నట్లుండి మూడు అదనపు థియేటర్లు పెరిగాయి. అంటే తెల్లవారు జామున షోలే ఏకంగా 8 స్క్రీన్స్‌ లో పడబోతుంది. ఇలా పలు ఏరియాల్లో ఇదే పరిస్థితి ఉందని సమాచారం అందుతోంది. మొత్తానికి వినయ విధేయ రామ చిత్రం భారీ థియేటర్లలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సునాయాసంగా బ్రేక్‌ ఈవెన్‌ ను దక్కించుకోవడం ఖాయమంటున్నారు.