Begin typing your search above and press return to search.

మగధీర రాసిన బాహుబలి రివ్యూ

By:  Tupaki Desk   |   3 May 2017 4:19 PM GMT
మగధీర రాసిన బాహుబలి రివ్యూ
X
టాలీవుడ్ 'మగధీర'గా.. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ చరణ్ తన కెరియర్ కు మంచి పునాదే వేసుకున్నాడు. ఆ తరువాత అనేక సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే మగధీరలో కేవలం ఓ అరగంట ఫ్లాష్‌ బ్యాక్ మాత్రమే రాజుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో తీసిన రాజమౌళి.. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఏకంగా పూర్తి స్థాయిలో రాజుల కాలం నాటి కతను చెప్పేశాడు.

ఈ ''బాహుబలి 2'' సినిమాను ఆల్రెడీ ఒకసారి చూసిన రామ్ చరణ్‌.. ఇప్పుడు రెండోసారి మళ్ళీ చూశాడు. డాడ్ మెగాస్టార్ చిరంజీవితో కలసి ఐమ్యాక్స్ బిగ్ స్ర్కీన్ లో సినిమాను చూసి.. తన అభిప్రాయాలను కూలంకషంగా పంచుకున్నాడు చరణ్‌. ''ఇండియాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అంటే బాహుబలే. రాజమౌళి గారు చూపించిన గ్రాండియర్ స్థాయి అమోఘం. విజువల్స్ డిటైలింగ్ అద్భుతంగా ఉండటం వలన.. మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తోంది. ప్రాంతీయ సరిహద్దులూ.. పేద ధనిక బేదాలు లేకుండా.. అన్ని వర్గాల వారూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. మన డార్లింగ్ ప్రభాస్ అబ్బురపరిచాడు. నా బెస్ట్ ఫ్రెండ్ రానా.. విలన్ గా ఇరగదీశాడు. ఏజ్ మారిన రెండు క్యారక్టర్లలో చాలా బాగా చేశాడు. అనుష్క.. తమన్నా.. రమ్యకృష్ణ గారు.. సత్యరాజ్ గారు కూడా అద్భుతం అంతే'' అని సెలవిచ్చాడు రామ్ చరణ్‌.

ఇప్పటికే ఓసారి బాహుబలి చూసి.. మెగాస్టార్ చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. చరణ్‌ కూడా బాగుందని చెప్పాడు. ఇప్పుడు రెండోసారి ఇలా రివ్యూ కూడా రాశాడమనాట చరణ్‌. ప్రస్తుతం సుకుమార్ సినిమా షెడ్యూల్ గ్యాప్ రావడంతో.. ఈ బ్రేక్ ఎంజాయ్ చేస్తున్నాడట మెగా హీరో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/