Begin typing your search above and press return to search.

తేడా వస్తే ఓవర్సీస్ లో గట్టి దెబ్బే

By:  Tupaki Desk   |   19 Sep 2015 3:30 PM GMT
తేడా వస్తే ఓవర్సీస్ లో గట్టి దెబ్బే
X
బ్రూస్ లీ చెప్పినట్లు చేస్తాడా ? చెప్పిన డేట్ కి వస్తాడా ? ఇది చాలా కష్టమైన ప్రశ్న. అక్టోబర్ 16కి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ ఉంటుందంటూ.. రామ్ చరణ్ ఖచ్చితంగా చెప్పేశాడు. కానీ ఇది అంత తేలిక కాదనే చెప్పాలి. ఇంకా ఈ మూవీకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ ల షూటింగ్ జరుగుతోంది. కొన్ని పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. అంతే కాదు.. చిరును స్పెషల్ రోల్ లో యాక్ట్ చేయిస్తున్నారు. 15నిమిషాల ఎపిసోడ్ లో చిరు కనిపిస్తారు. ఓ పాట, ఫైట్ కూడా షూట్ చేయాల్సి ఉంది.

అంతేకాదు.. ఆడియో ఫంక్షన్ కూడా ఇంకా చేయలేదు బ్రూస్ లీకి. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. దీని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సెన్సార్ కి అప్లై చేసుకోవాలి. ఇన్ని పనులను కంప్లీట్ చేయడానికి.. యూనిట్ దగ్గర ఉన్న గట్టిగా 20 రోజులే. ఓవారం ముందుగా కాపీ రెడీ చేసుకుంటేనే ఓవర్సీస్ లో బ్రహ్మాండమైన బిజినెస్ సాధ్యమవుతుంది.

అమెరికా మార్కెట్ లో ఇప్పటివరకూ చరణ్ కు సరైన సినిమా లేదు. కనీసం మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంట్రీ కూడా లేదు. నాని లాంటి మీడియం హీరోకి 2 మిలియన్ డాలర్ల సినిమా ఉందని, చెర్రీకి అది కూడా లేదనే.. విమర్శలకు సమాధానం చెప్పడం ఇప్పుడు చాలా అవసరం మెగాపవర్ స్టార్ కి. ఇక్కడ మార్కెట్ నిలబెట్టుకోవాలంటే.. అన్నీ పంక్చువల్ గా జరగాలి. డేట్ మారడం - లేట్ అవ్వడం లాంటివి ఇక్కడ వర్కవుట్ కావు. కానీ పెండింగ్ పనులన్నిటికీ.. ఎప్పటికీ ఎండింగ్ పడుతుందో అర్ధంకాని పరిస్థితి.

చూస్తుంటే.. చెప్పిన టైంకి రావడానికి.. బ్రూస్ లీ తనతో తానే ఫైట్ చేస్తున్నట్లున్నాడు.