Begin typing your search above and press return to search.
150 తేల్చాకే ఏదైనా అంటున్న చరణ్
By: Tupaki Desk | 6 Oct 2015 5:30 PM GMTఎనిమిదేళ్ళ ఎదురుచూపులకు చిరు తెరదించినా ఇంతవరకు ఆ సినిమా పట్టాలెక్కనే లేదు. చిరు ఒప్పుకుంటే చాలు సినిమా కన్ ఫర్మ్ అని అనుకున్నది కాస్తా కథ దొరికితే అన్నంత వరకూ వచ్చింది. ఎటొచ్చీ అభిమానుల నిరీక్షణ ఫలించే రోజేప్పుడన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ విషయాన్ని చెర్రీ కూడా సీరియస్ గా తీసుకున్నారట. 150వ సినిమా సంగతి తేలాకే ఏదైనా అంటున్నారు. ఆ మాట ఎందుకొచ్చిందంటే...
బ్రూస్ లీ సినిమా ముందుగా ప్రకటించినట్టే ఈ నెల16న విడుదల కానుంది. దీని తర్వాత చరణ్ చేయబోయే సినిమా కన్ ఫర్మ్ అయిపొయింది. తమిళ సినిమా తనీ ఒరువన్ రీమేక్ ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. చెర్రీ తో సినిమా చేయాలనుకుంటున్న సూరి ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ స్పీడ్ లో చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలైన డివివి దానయ్య - ఎన్వీ ప్రసాద్ లు కూడా రెడీ. అయితే చరణ్ మాత్రం 150వ సినిమా ఓ కొలిక్కి వచ్చాకే మన సినిమా అంటూ ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి వెళదాం అని చెప్పారట. చిరు మరి కొద్దిరోజుల్లో ప్రకటన రానుంది అని బ్రూస్ లీ ఆడియో వేదికపై చెప్పేశారు. కనక నిర్మాతగా మారనున్న చరణ్ ఆ పనులన్నీ దగ్గరుండి చూసుకోవాలి. అసలే కొత్త కొలువు మరి. ఏమైనా చిరు 150వ సినిమా కోసం అభిమానుల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టు వున్నాడు. 16లోపు ప్రకటన రావడం పక్కా అంటున్నారు కాబట్టి ఈ కొద్ది రోజులు మెగాఫాన్స్ ఓపిగ్గా వుండాలి మరి.