Begin typing your search above and press return to search.
దూకేసి ఈత నేర్చుకున్నా: రామ్ చరణ్
By: Tupaki Desk | 16 Dec 2016 5:24 AM GMTటాలీవుడ్ కి కొత్త సినిమాల విషయంలో బోలెడంత ధైర్యం ఇచ్చింది రామ్ చరణ్ ధృవ. కంటెంట్ బాగుంటే.. భారీ చిత్రాలను రిలీజ్ చేయచ్చనే భరోసా టాలీవుడ్ మేకర్స్ లో కలిగించింది. అయితే డీమానిటైజేషన్ ఈ సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది.. అసలు ఎందుకు ఇంత ధైర్యం చేసి రిలీజ్ చేయాల్సి వచ్చిందో.. తనే చెప్పాడు మెగా పవర్ స్టార్.
'డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన తొలి భారీ చిత్రం ధృవ. నాన్న నటించిన 150వ చిత్రం సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండడంతో.. కచ్చితంగా గ్యాప్ ఉండాలి. దాంతో మాకు వేరే ఛాయిస్ లేకపోయింది. ఓపెనింగ్స్ 15-20శాతం తగ్గుతాయని ముందే ఎక్స్ పెక్ట్ చేశాం. అనుకున్నదాని కంటే కొంచెం తక్కువగానే కనిపించాయి. కానీ మౌత్ టాక్ కారణంగా రెండో రోజుకల్లా మూవీ విపరీతంగా పుంజుకుంది. హౌస్ ఫుల్స్ అయిపోయి డిమానిటైజేషన్ పై గెలిచింది ధృవ' అని చెప్పాడు చెర్రీ
'ధృవపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే యూఎస్ ప్రీమియర్స్ కి అటెండ్ అవాలనే డెసిషన్ తీసుకున్నాం. నేను సహజంగా రిలీజ్ లకి ముందు టెన్షన్ పడుతుంటా. హైద్రాబాద్ లో కూడా ప్రీమియర్స్ చూడను. ఇలా భయపడ్డం పరిష్కారం కాదని అనిపించింది. అందుకే ముందు సముద్రంలో దూకేసి అప్పుడు ఈత కొడదాం అనుకున్నా. ఒకవేళ టాక్ తేడా వచ్చినా సరే.. ముందే చెప్పినట్లుగా అన్ని ఏరియాస్ ను కవర్ చేసేవాడిని. కానీ నా టెన్షన్ అంతా న్యూజెర్సీలో పడిన మొదటి ప్రీమియర్ తోనే తీరిపోయింది' అన్నాడు చిరుత.
ఇక రాబోయే సినిమాల సంగతులు కూడా చరణ్ చెప్పుకొచ్చాడు. మైత్రీ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా.. సంక్రాంతి తర్వాత ప్రారంభం అవుతుందన్న చరణ్.. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తేల్చేశాడు. ధృవకు కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుందని చెప్పడంతోపాటు.. విలేజ్ నేటివిటీని తీయడంలో సుకుమార్ స్ట్రెంగ్త్ ఏంటో అందరికీ తెలుస్తుందంటున్నాడు రామ్ చరణ్.ఆ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తానని చెప్పాడు చెర్రీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/