Begin typing your search above and press return to search.

సినిమాలు బాగోకపోతే ఫ్యాన్స్ దూరమవుతారు

By:  Tupaki Desk   |   19 Dec 2016 4:40 AM GMT
సినిమాలు బాగోకపోతే ఫ్యాన్స్ దూరమవుతారు
X
రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ డిసెంబర్ 9న థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ అయేందుకు అన్ని అవకాశాలు ఉన్న ఈ చిత్రం.. డీమానిటైజేషన్ కారణంగా బాగానే ఎఫెక్ట్ పడింది.

'30శాతం వసూళ్లపై ప్రభావం ఉంటుందని ముందే ఊహించాం. దానికి ముందుగానే సిద్ధపడ్డాం. పెద్ద నోట్ల రద్దు తర్వాత రిలీజ్ అయిన తొలి భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఫేస్ చేయక తప్పదు. అయినా సరే.. అనుకున్న టైంకి రిలీజ్ చేశాం. రిజల్ట్ పై సంతృప్తిగానే ఉన్నాం' అన్నాడు రామ్ చరణ్. కంటెంట్ సరిగా లేని ఒరిజినల్ కంటే పర్ఫెక్ట్ గా ఉన్న రీమేక్ చేయడంలో తప్పు లేదన్న చెర్రీ.. ధృవ మూవీలో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామికి ఎక్కువ కేరక్టర్ ఉన్న విషయంపైనా మాట్లాడాడు. 'ప్రతీ ఫ్రేమ్ లోనూ నేనే కనిపించాలని అనుకోవడం లేదు. నా ఫ్యాన్స్ మంచి సినిమా చూడ్డానికి థియేటర్ కి వెళ్లాలి. లేకపోతే.. సుదీర్ఘకాలం ఫ్యాన్స్ గా ఉండడం కష్టం అవుతుందేమో' అంటూ మనసులో మాట చెప్పాడు చెర్రీ.

'సంక్రాంతికి వస్తున్న ఖైదీ నెంబర్ 150పైనే దృష్టి నిలిపాను. ధృవ లేట్ చేస్తే.. ఖైదీతో క్లాష్ వస్తుంది. నాన్నకి ప్రెస్టీజియస్ మూవీ అని మాత్రమే కాకుండా.. నేను ఆ మూవీ నిర్మాతను కూడా. ప్రస్తుతం నా కాన్సంట్రేషన్ అంతా ఖైదీ పైనే. ఇందులో నేను కేమియో చేసినా.. అది కేవలం సెంటిమెంట్ కోసమే. ఆయన సినిమాకి నా కేమియోతో అవసరం ఏమీ ఉండదు' అని చెప్పిన మెగా పవర్ స్టార్.. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయ్యాక సుకుమార్ తో సినిమా మొదలుపెడతానని అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/