Begin typing your search above and press return to search.
మావయ్యతో చేస్తే అమ్మ హ్యాపీ-చరణ్
By: Tupaki Desk | 24 Dec 2016 4:29 AM GMTతన మావయ్య అల్లు అరవింద్ తో సినిమా చేస్తే తన తల్లి సురేఖ చాలా సంతోషిస్తుందని అంటున్నాడు రామ్ చరణ్. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లయిన మగధీర.. ధృవ సినిమాలు రెంటినీ తన మావయ్య నిర్మాణంలోనే చేయడం చాలా హ్యాపీ అంటూ ‘ధృవ’ను ఆదరించినందుకు ప్రేక్షకులకు సెల్యూట్ చేస్తూ ఈ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చరణ్ అన్నాడు. నెంబర్లు.. రికార్డుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేమని.. అందుకే తాను వాటి గురించి ఆలోచించని చరణ్ వ్యాఖ్యానించాడు. ఇంకా అతను ఏమన్నాడంటే..
‘‘నేను రికార్డుల గురించి పట్టించుకోను. అలాగే నెంబర్లు.. సీట్ల గురించి ఆలోచించను. అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ చేయలేం. మంచి కథలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. మా మామ అల్లు అరవింద్ గారితో కలిసి సినిమా చేసిన ప్రతి సారీ మా అమ్మ చాలా ఆనందపడుతుంది. ‘మగధీర’ తర్వాత మరలా సినిమా చేయాలని నేను.. మావయ్య నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. అలాగే సురేందర్ దర్శకత్వంలో చేయాలని కూడా ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఒకసారి మణిరత్నం గారితో మాట్లాడినపుడు వైవిధ్యమైన కథల్ని వింటూ ఉండమని చెప్పారు. ఆ మాట నా మనసులో విత్తనంలా పడింది. ఇప్పుడు ‘ధృవ’ సినిమాను అంగీకరించడానికి కూడా అదే కారణం’’ అని చరణ్ చెప్పాడు. ‘ధృవ’ను రిలీజ్ చేసే సమయంలో చాలా టెన్షన్ పడ్డామని.. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి ఫలితాన్నిచ్చారని అరవింద్ అన్నారు. ఈ ఏడాది కొడుకులిద్దరితో రెండు హిట్లు.. మేనల్లుడితో ఒక హిట్టు కొట్టిన తాను తండ్రిగా..మావయ్యగా చాలా సంతోషంగా ఉన్నానని అరవింద్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/