Begin typing your search above and press return to search.
ఆ విలన్ లో ఏముంది చెర్రి?
By: Tupaki Desk | 13 Nov 2015 7:30 PM GMTరామ్ చరణ్ అమెరికా నుండి ఎప్పుడు తిరిగొస్తాడో తెలియదు కాని.. వచ్చాక మాత్రం నానా రచ్చే అంటూ మెగా అభిమానులు ఫిక్సయిపోయారు. వెంటనే సురేందర్ రెడ్డి దర్వకత్వంలో మనోడు తమిళ సినిమా తని ఒరువన్ రీమేక్ మొదలెట్టేస్తాడని టాక్. అయితే ఈ సినిమా రీమేక్ ఏమో కాని.. మనోళ్లు స్క్రిప్టు కంటే ఎక్కువగా విలన్ పైన ఫోకస్ పెడుతున్నారు.
వాస్తవానికి ఈ సినిమా సెకండాఫ్ లో హీరోతోపాటు విలన్ కుడా కూడా ఎక్కువగా స్ర్కీన్ ప్రెజన్స్ ఉంటుంది. అయితే సినిమాలో విలన్ పోషించేది ఒక సైంటిస్ట్ పాత్ర. అందుకే అతగాడు క్లాస్ ఉంటే బాగుంటుందని అరవింద్ స్వామిని రంగంలోకి దించారు తమిళ నిర్మాతలు. ఇరగపొడిసేటంత క్యారెక్టర్ డిజైన్ ఏమీ ఉండదక్కడ. కేవలం ఇంటెలిజెంట్ గా హీరోతో ఒక వార్ నడుపుతాడు అంతే. ఏది.. మన జులాయ్ సినిమాలో సోనూ సూద్ - అల్లు అర్జున్ టైపులో అనమాట. ఇలాంటి విలన్ లను వెతకడం చాలా చింపులే మరి.
అసలు జగపతి బాబు సూపరుంటాడు. లేకపోతే సోనూ సూద్ ఎలాగో ఒక ఆప్షన్ ఉన్నాడు. లేదంటే వివేక్ ఒబెరాయ్.. నీల్ నితిన్ ముకష్ వంటి బాలీవుడ్ ఫ్లాప్ స్టర్స్ ఎవరు చేసినా బాగానే ఉంటుంది. ఆ మాత్రం దానికి విలనో విలనో అంటూ హడావుడి ఎందుకండీ బాబూ? ఏమంటావ్ చరణ్?