Begin typing your search above and press return to search.
చరణ్ కి వాళ్లంటే ఎందుకంత అసూయ?
By: Tupaki Desk | 19 Dec 2016 11:30 AM GMTతెలుగు ఇండస్ట్రీలో యువ కథానాయకులు సంఖ్య బాగా పెరిగింది. ఒకొక్క కుటుంబం నుంచి నలుగురైదుగురు హీరోలు కనిపిస్తున్నారు. అలాగని ఇండస్ట్రీలో ఉన్నది కేవలం వారసులు మాత్రమే కాదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా - సొంత టాలెంట్ తో పైకొస్తున్నవాళ్లూ ఉన్నారు. నాని - శర్వానంద్ - రాజ్ తరుణ్ - నాగశౌర్య తదితరులే అందుకు ఉదాహరణ. ఇండస్ట్రీలో అంతమంది హీరోలు ఉన్నప్పుడు పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే చాలామంది కథానాయకులు పోటీ అనే విషయాన్ని ఒప్పుకోరు. ``మామధ్య పోటీ ఏం లేదు - మేమంతా స్నేహితులమే. ఎవరికి రావల్సిన కథలు వాళ్ల దగ్గరికి వస్తుంటాయంతే`` అంటుంటారు. కానీ మెగా హీరో రామ్ చరణ్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ఆ హీరోల్ని చూస్తే నాకు అసూయగా ఉంటుందని ఓపెన్ గా చెప్పేశాడు.
ఇంతకీ రామ్ చరణ్ కి అసూయ కలిగిస్తున్న ఆ హీరోలు ఎవరో తెలుసా?... శర్వానంద్ - నాని. రామ్ చరణ్ కి శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరూ కలిసి ఓకే స్కూల్లో చదువుకొన్నారు. ఒరేయ్ ఒరేయ్ అనుకొనేంత సాన్నిహిత్యం వాళ్లది. నాని అంటే కూడా చరణ్ కి ఇష్టమే. వాళ్లిద్దరి మధ్య కూడా మంచి స్నేహమే ఉంది. మరి వాళ్లపై చరణ్ కి ఎందుకుంటుంది అసూయ అనేదేగా మీ సందేహం. వాళ్లు కథల్ని ఎంపిక చేసుకునే విధానమే చరణ్ అసూయకి కారణమట. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ ``శర్వానంద్... నాని మంచి కథల్ని ఎంచుకుంటుంటారు. ఆ విషయంలో కొన్నిసార్లు వాళ్లని చూసి అసూయగా ఫీలవుతుంటా. వాళ్లలాగే నాకూ ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల్ని చేయాలనిపిస్తుంటుంది`` అని చెప్పుకొచ్చాడు చరణ్. మొత్తంగా అసూయ అంటూనే శర్వానంద్ - నానిలకి మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు చరణ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/