Begin typing your search above and press return to search.
ఆ విషయంలో ఆచితూచి అడుగేస్తున్న చరణ్...!
By: Tupaki Desk | 18 April 2020 2:30 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'జంజీర్' అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా అమితాబ్ నటించిన 'జంజీర్' సినిమాకి రీమేక్. ఈ సినిమా 'తుఫాన్' పేరుతో తెలుగులో కూడా విడుదల కాబడింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా - శ్రీహరి - సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించగా అపూర్వ లఖియా దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంతేకాకుండా ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికి చెడ్డ పేరు తీసుకొచ్చింది. జంజీర్ తర్వాత మరో హిందీ సినిమా చేయని చరణ్.. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తీసుకొని ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్నాడు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఏర్పడింది. 'ఆర్.ఆర్.ఆర్' మూవీతో రామ్ చరణ్ కచ్చితంగా బాలీవుడ్ లో ఫేమస్ అయ్యే అవకాశాలున్నాయి. చెర్రీకి ఈ సినిమా తర్వాత హిందీలో కూడా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ మంచి ఆఫర్స్ వస్తే బాలీవుడ్ లో కూడా తన లక్ చెక్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటడం కొత్తేమీ కాదు. ఇంతకముందు కింగ్ నాగార్జున - చిరంజీవి - వెంకటేష్ లాంటి హీరోలు అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లేటెస్టుగా ప్రభాస్ కూడా బాహుబలి సాహో చిత్రాలతో అక్కడ కూడా మార్కెట్ ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా మన టాలీవుడ్ హీరోల సినిమాలు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడి జనాలు విరగబడి చూస్తున్న విషయం మనకి తెలిసిందే.
కాగా చరణ్ మాత్రం హిందీ సినిమాల విషయంలో అత్యుత్సాహం చూపించడం లేదంట. వాటి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నాడట. 'జంజీర్' విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ లో మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ చరణ్ కి జోడీగా కనిపించనుందని సమాచారం.