Begin typing your search above and press return to search.

చరణ్ డైలాగ్ లో అంత మీనింగ్ ఉందా ?

By:  Tupaki Desk   |   12 Jan 2019 12:32 PM GMT
చరణ్ డైలాగ్ లో అంత మీనింగ్ ఉందా ?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చేలా రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో రంగస్థలం తర్వాత రాకూడని సినిమాగా ఇప్పటికే టాక్ వచ్చేసింది. ఊర మాస్ హీరోయిజంతో బోయపాటి శీను వండిన వంటకంలో మసాలా ఎక్కువైపోయి తినలేనిదిగా తయారయ్యింది. అయితే ఇందులో ఓ సన్నివేశం మాత్రం జనసేనతో పాటు మిగిలిన వాళ్ళకూ చర్చగా మారింది. ఇందులో విలన్ వివేక్ ఒబెరాయ్ పాత్రను ఉద్దేశించి రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఒకటుంది. అవసరం అనుకుంటే ఏ జెండా అయినా ఎత్తుతాం లేదంటే ఎవరి జెండా అయినా పీకుతాం అని.

ఇది పవన్ కు కనెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో 2014 ఎన్నికల్లో పవన్ టిడిపికి మద్దతు తెలుపుతూ ప్రచారం చేయడం వల్ల సదరు పార్టీ లాభ పడిన సంగతి తెలిసిందే. అప్పుడు బాబు పవన్ పలుమార్లు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టిడిపి ఫెయిల్ కావడంతో పాటు ప్రత్యేక హోదా విషయంలో రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడంతో పవన్ బాబుతో కటీఫ్ చేసుకున్నాడు. స్వంతంగా పోటీ చేయటమో లేదా వామపక్షాలతో పొత్తులో ఉండొచ్చని అంటున్నాడు.

అంటే వినయ విధేయ రామలో చరణ్ చెప్పిన డైలాగ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగానే అని ఫ్యాన్స్ వెర్షన్. మాట ఇచ్చారు కాబట్టి జెండా ఎత్తాడు తర్వాత తప్పారు కాబట్టి దాన్ని దించాడు అని చెబుతున్నారు. బోయపాటితో చెప్పి చరణ్ ఈ డైలాగ్ వచ్చేలా చేసాడని టాక్ ఉంది. ప్రీ రిలీజ్ లో సైతం చరణ్ బాబాయ్ పార్టీ గురించి టీ గ్లాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. మొత్తానికి జెండా డైలాగ్ పెద్ద చర్చకే తావిచ్చింది