Begin typing your search above and press return to search.
ప్రజా సేవికుడంటే నా ఫ్రెండే-చరణ్
By: Tupaki Desk | 28 Dec 2018 4:26 AM GMT`చరణ్ - బోయపాటి - దానయ్య` కాంబో మూవీ `వినయ విదేయ రామ` సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మెగా బాస్ చిరంజీవి, రామ్‌చరణ్ లతో వేదికను పంచుకున్నారాయన.
ఈ వేదికపై కేటీఆర్ లోని డైనమిజాన్ని మెగాస్టార్ గొప్పగా పొగిడేశారు. ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే వాక్చాతుర్యం ఉన్న గొప్ప యువనాయకుడు అంటూ కీర్తించారు. డాడ్ అలా పొగిడేస్తే కుమారుడేమైనా తక్కువ తిన్నారా? రామ్ చరణ్ సైతం తన స్నేహితుడు కేటీఆర్ గొప్ప లీడర్ అంటూ కీర్తించారు. గత ఎన్నికల్లో తెరాస సాధించిన ఘనవిజయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుని ఆ విజయానికి తన స్నేహితుడే కారణమని ప్రశంసించారు. గ్రేట్ విక్టరీ.. ప్రజల్ని ఇంకా బాగా పాలించాలని కేటీఆర్ ని కోరారు.
చెర్రీ ఈ వేదికపై మాట్లాడుతూ - ``మన ప్రియతమ నాయకుడు - గ్రేట్ లీడర్ - యూత్ కి ఇన్ స్పిరేషన్ అయిన కె.టి.ఆర్ కి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు నా అభినందనలు. ఆయన నా స్నేహితుడని చెప్పుకోవడానికి గర్తిస్తాను. చాలా లవబుల్ పర్సన్. ఆయన ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి`` అన్నారు. ఆయన్ను చూస్తుంటే, ఆయన పని చేసే తీరు చూస్తుంటే కేసీఆర్ గారి విజన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే తపన - హార్డ్ వర్క్ - పబ్లిక్ కు సర్వీస్ చేయాలనే ఉత్సాహం ఎంతో స్ఫూర్తి నింపుతుంది. మా అందరి తరుపున మీరు సాధించిన ఒక గ్రేట్ విక్టరీకి శుభాకాంక్షలు అని చరణ్ అన్నారు. చెర్రీ తన ఫ్రెండును ఎంతో గౌరవమర్యాదలతో - ప్రేమాప్యాయతలతో వేదికపై పొగిడేయడం మెగాభిమానులకు సర్ ప్రైజ్. ఇక కేటీఆర్ ఫాలోవర్స్ - అభిమానులకు మెగా ఫ్యామిలీపైనా - చిరంజీవి - చరణ్ పైనా ఈ ఈవెంట్ ప్రత్యేక గౌరవాన్ని పెంచింది.