Begin typing your search above and press return to search.
సల్మాన్ తో రామ్ చరణ్ సినిమా?
By: Tupaki Desk | 16 Dec 2015 11:30 AM GMTఏదో నేషనల్ మీడియా ముందు మాట వరసకు ఈ మాటన్నాడో లేక నిజంగానే అలాంటి ఆలోచన ఉందేమో తెలియదు కానీ.. రామ్ చరణ్ ఓ సంచలన ప్రకటనైతే చేసేశాడు. తన సొంత బేనర్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా సినిమా నిర్మిస్తానన్నాడు. ‘రిట్జ్ ఐకాన్ అవార్డ్స్’ కార్యక్రమంలో కోసం బెంగళూరుకు వెళ్లిన చెర్రీ.. అక్కడ ఓ నేషనల్ ఛానెల్ తో చిట్ చాట్ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిరంజీవి 150వ సినిమా కత్తి రీమేకే.. దానికి దర్శకుడు వి.వి.వినాయకే అన్న సమాచారం అందులో భాగమే.
దీంతో పాటు తన బేనర్ లో సల్మాన్ సినిమా గురించి కూడా వెల్లడించాడు చరణ్. సల్మాన్ తనకు బిగ్ బ్రదర్ లాంటి వాడని.. అతడితో తన బేనర్ లో సినిమా నిర్మించే ఆలోచన ఉందని చెప్పాడు చరణ్. సల్మాన్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తమ ఇంటి నుంచే క్యారియర్ వెళ్తుందని.. అలాగే తాను ‘జంజీర్’ షూటింగ్ కోసం ముంబయిలో ఉన్నపుడు సల్మాన్ కూడా తనను అలాగే చూసుకున్నాడని చరణ్ చెప్పాడు. ఇక అఖిల్ తొలి సినిమా గురించి.. అతడి డ్యాన్సింగ్ టాలెంట్ గురించి చరణ్ దగ్గర ప్రస్తావించగా.. ఆడియన్స్ నుంచి అఖిల్ పెర్ఫామెన్స్ విషయంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, అతను స్టార్ హీరో కాగలడని చరణ్ అన్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ఇంకా ఆలోచించలేదని.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా హాలిడే డెస్టినేషన్ కు వెళ్తానని చరణ్ చెప్పాడు.