Begin typing your search above and press return to search.

బన్నీ చెప్పిన కథ చెర్రీకి చేరిందట

By:  Tupaki Desk   |   8 Dec 2017 1:07 PM IST
బన్నీ చెప్పిన కథ చెర్రీకి చేరిందట
X
సినిమా స్టార్స్ కు మూవీస్ చేయడమే కాదు.. చూడడం కూడా బాగానే అలవాటు ఉంటుంది. పవన్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన సినిమాలు చూడం అని చెప్పేవాళ్లు అరుదుగానే ఉంటారు. అల్లు అర్జున్ అయితే రకరకాల థీమ్ లతో తెరకెక్కిన విభిన్నమైన మూవీస్ ను ఇష్టపడతాడు అనే టాక్ ఉంది.

ఇలాగే ఓ కాన్సెప్ట్ బన్నీకి విపరీతంగా నచ్చేసిందట. ఆ పాయింట్ ను డిఫరెంట్ థీమ్ తో.. అంటే మన నేటివిటీకి తగినట్లుగా పల్లెటూరి వాతావరణానికి మార్చి డెవలప్ చేస్తే అద్భుతంగా ఉంటుందని.. ఓ సారి సుకుమార్ తో డిస్కస్ చేశాడట. బన్నీ చెప్పిన ఐడియా నచ్చి సుక్కు రియల్ గానే తెగ వర్క్ చేసి ఓ స్టోరీ సిద్ధం చేయగా.. అదే రంగస్థలం1985 మూవీ అనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజానిజాల సంగతి ఎంతో తెలియదు కానీ.. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కి ఓపెన్ గానే సుకుమార్ చెప్పేశాడని అంటున్నారు.

ఈ విషయం తెలిసి నవ్వేసిన బన్నీ.. సుకుమార్ కి కంగ్రాట్స్ కూడా చెప్పాడట. అయితే.. బన్నీ చెప్పిన స్టోరీ పాయింట్ నచ్చేసి.. అదే కథను అదే కుటుంబానికి చెందిన రామ్ చరణ్ తో తెరకెక్కించేందుకు ఒప్పించగలగడం చూస్తే.. సుకుమార్ ఎంతటి తెలివైన వాడో అర్ధమవుతుందని పలువురు మాట్లాడుకుంటున్నారు. మేకింగ్ లోనే కాదు.. ప్రాజెక్టులు ఫైనలైజ్ చేసుకోవడంలో సుక్కు ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తాడని చెప్పేందుకు ఇదే చక్కని ఉదాహరణ అంటున్నారు.