Begin typing your search above and press return to search.
గోదావరితో మెగా ముచ్చట ముగిసింది
By: Tupaki Desk | 26 Jun 2017 4:43 PM GMTచాలా రోజుల నుండి ఎండలను కూడా డేర్ చేస్తూ తెగ కష్టపడిపోతున్నాడు రామ్ చరణ్. ఇప్పుడు సరిక్రొత్త కథలను తీయాలనే నెపంతో మొన్న ''ధృవ''ను తీశాక.. ఆ తరువాత సుకుమార్ డైరక్షన్లో ''రంగస్థలం 1985''ను ఎంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాలను.. అలాగే పోలవరం.. కొల్లేరు తదితర ప్రాంతాలను ఎంచుకున్నారు టీమ్. కాని అక్కడే వచ్చింది అసలు తంటా.
నిజానికి మండే ఎండల్లో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడాను ఔట్ డోర్ సీన్లు తీయాలంటే.. చాలా కష్టమే. ఈసారి ఎండాకాలంలో సూర్యుడు తన ప్రతాపాన్ని బాహుబలిలో కాళకేయుల టైపులో చూపించేశాడు. అయినాసరే అన్నింటినీ భరిస్తూ మెగా పవర్ స్టార్ బాగానే కష్టపడ్డాడు. కాకపోతే అక్కడకు సమంత వచ్చిన జాయిన్ అయిన తరువాత.. ఆమెను ఎండను తట్టుకోలేక పడిపోవడంతో.. షూటింగ్ కు పేకప్ చెప్పారు. ఎండలు ముగిశాక తిరిగి మనోళ్ళు మళ్లీ రాజమండ్రి వెళ్లి.. ఇప్పుడు దిగ్విజయంగా షూటింగ్ అంతా ముగించేశారు. ఈ దెబ్బతో టోటల్ గోదావరి ఎపిసోడ్ అంతా ముగిసినట్లే. దీనికి బ్యాలెన్స్ పార్టును కేరళలో షూట్ చేస్తారు. ఆ తరువాత మిగతా భాగాన్ని సెట్టేసి హైదరాబాదులో తీస్తారు. ఆ విధంగా సినిమా షూటింగ్ పూర్తవుతుంది.. ఇక ప్రస్తుతానికి గోదావరితో మెగా ముచ్చటంతా ముగిసినట్లే.
సుకుమార్ డైరక్షన్లో.. రత్నవేలు సినిమాటోగ్రాఫిలో.. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో రూపొందుతున్న రంగస్థలం 1985 సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ లైన మైత్రి మూవీస్ వారు ఆల్రెడీ ఈ సినిమాపై పెడుతున్న సగం ఇన్వెస్టుమెంటును శాటిలైట్ రైట్స్.. డిజిటల్ రైట్స్ రూపంలో లాగేశారంటేనే సినిమా పట్ల ఉన్న క్రేజ్ ను చూసుకోవచ్చు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/