Begin typing your search above and press return to search.
చరణ్ వచ్చేది సంక్రాంతికే.. నో డౌట్
By: Tupaki Desk | 26 July 2017 8:15 AM GMTఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఏయే సినిమాలు వస్తున్నాయి అనే దానిపై చాలా పెద్ద చర్చే నడుస్తోంది. ఆల్రెడీ ఓ రెండుసార్లు తలపడిన సంక్రాంతి పుంజులు మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ తమ సినిమాలను ఆల్రెడీ ఆ ఫెస్టివల్ టైముకు ప్రకటించేశారు. కొరటాల శివ డైరక్షన్లో రూపొందుతున్న భరత్ అను నేను.. అలాగే సుకుమార్ తీస్తున్న రంగస్థలం 1985 కూడా సేమ్ అదే టైముకు ఫిక్స్ చేశారు. కాకపోతే కొత్తగా పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా కూడా అదే సంక్రాంతి 2017కు దించాలని ప్లాన్ చేయడం.. ఇప్పుడు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి హౌ అండీ హౌ అంటూ ట్రేడ్ వర్గాలను కలవరపెట్టేస్తున్నాయి.
అయితే బాబాయ్ కోసం రామ్ చరణ్ ఇప్పుడు రేసు నుండి తప్పుకుంటాడంటూ ఒక టాక్ వచ్చింది. కాని ఇదే విషయాన్ని రంగస్థలం టీమ్ దగ్గర ప్రశ్నిస్తే.. అబ్బే అదేం లేదు అంటున్నారు. ఆల్రెడీ పవన్ అండ్ మహేష్ సినిమాల ప్రొడ్యూసర్లతో మాట్లాడే డేట్లన్నీ కన్ఫామ్ చేసుకున్నారట. అందుకే రంగస్థలం 1985 సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తుందని చెబుతున్నారు. ఆల్రెడీ సుకుమార్ కూడా చాలా స్పీడప్ చేసి షూటింగ్ చేయడం వలన.. ఇప్పుడు అనుకున్న టైమ్ కు రాకపోవడం వంటి కూడా లేదంటున్నారు. అదే విధంగా రామచరణ్ సినిమాను డిసెంబర్ లోకి తీసుకొస్తారని.. అప్పుడు అఖిల్ సినిమా ఈ సినిమాతో క్లాష్ అయ్యే పరిస్థితి ఉందని కొందరు అంటున్నారు కాని.. ఇలా రంగస్థలం సంక్రాంతికే వస్తే ఆ టాక్ అంటా జస్ట్ టాక్ గానే మిగిలిపోతుంది. అది సంగతి.