Begin typing your search above and press return to search.
చెర్రీ సినిమాకి అప్పుడే అంతొచ్చిందా?
By: Tupaki Desk | 6 Nov 2017 7:50 AM GMTశాటిలైట్... డిజిటల్ మార్కెట్ పుణ్యమా అని తెలుగు సినిమా వెలిగిపోతోంది. అయితే చిన్న చిత్రాల కంటే స్టార్ల సినిమాలకే ఆ మార్కెట్ లో వ్యాల్యూ. ఒక మంచి కాంబినేషన్ తో సినిమా తెరకెక్కుతోందని తెలిస్తే చాలు.. టీవీ ఛానళ్లు - డిజిటల్ వ్యాపారులు రైట్స్ కోసం క్యూ కట్టేస్తుంటారు. బాహుబలి చిత్రాల తర్వాత తెలుగు సినిమాలకి హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగు సినిమాని హిందీలోకి డబ్ చేసేసి టీవీలకి ఇచ్చేస్తూ - డిజిటల్ మాధ్యమాల్లో పెట్టేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. దాంతో ఇదివరకు తెలుగు రైట్స్ పైనే ఆధారపడి సినిమాలు తీసిన నిర్మాతలకి - ఇప్పుడు హిందీ మార్కెట్ మరో వరంగా మారింది. తెలుగు - హిందీ భాషల్లోని డిజిటల్ - శాటిలైట్ బిజినెస్ తోనే చాలా సినిమాలకి సగం బడ్జెట్టు తిరిగొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
తాజాగా రంగస్థలం విషయంలో అదే జరిగింది. రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఇప్పటికే తెలుగు డిజిటల్ - శాటిలైట్ హక్కుల రూపంలో 20 కోట్లు వచ్చాయట. తాజాగా హిందీ శాటిలైట్ - డిజిటల్ రైట్స్ రూపంలో సినిమాకి మరో పది కోట్లు వచ్చినట్టు సమాచారం. అంటే ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే చెర్రీ సినిమాకి 30 కోట్లు వచ్చాయన్నమాట. ఒక్క చెర్రీ సినిమాకే కాదు - దాదాపు తెలుగులో మంచి కాంబినేషన్లలో తెరకెక్కుతున్న స్టార్ కథానాయకుల సినిమాలన్నింటినీ ఈమధ్య ఇదే తరహాలో మార్కెట్ అవుతోందని టాలీవుడ్ వర్గాలు ఆనందంగా చెబుతున్నాయి.