Begin typing your search above and press return to search.
రంగస్థలం 1985 అంటే ఇదే
By: Tupaki Desk | 31 Oct 2017 7:14 AM GMTప్రస్తుత రోజుల్లో గతాన్ని చూపించాలంటే దర్శకుడికి చాలా ఒత్తిడికి మించిన పని. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఉన్నామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కనిపిస్తే చాలదు ఆ అనుభూతికి లోనయ్యేలా చేయాలి. అప్పుడే దర్శకుడి ప్రతీభ బయటపడుతుంది. లేకుంటే ఏ మాత్రం తేడా వచ్చినా చిన్న సిన్ కూడా మొత్తం సినిమా మూడ్ ని చేంజ్ చేసే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు రంగస్థలం 1985 కోసం సుకుమార్ కూడా అంతే కష్టపడుతున్నాడు.
1985 కాలంలోకి రంగస్థలం అనే ఊహాజనితమైన ఊరికి తీసుకెళ్లడానికి సినిమాను రెడీ చేస్తున్నాడు. ఈ మధ్యన సినిమాకి సంబందించి ఫొటోస్ ని బాగానే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ రీసెంట్ గా మరొక పిక్ ని రిలీజ్ చేసింది. రంగస్థలం అనే ఊరిలో ఒక స్పెషల్ ప్లేస్ ను చూపించాడు. మొదట అందరు రంగస్థలం అంటే నాటకాలకు సంబందించిందా? ఏంటని అనుకున్నారు. కానీ అది ఊరి పేరని తెలుస్తోంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది.
రంగస్థలం అనేది ఎక్కువగా నాటకాలకు సంబందించిన పేరు అని మనకు తెలుసు. రంగస్థలంపై ఎన్నో హావభావాలని నటులు కనబరుస్తారు. ప్రతి ఒక్క ఫీలింగ్ రంగస్థలంపై ఉంటుంది. నటులు ఆకర్షించే విధంగా పాత్రలను చేస్తుంటారు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు సుకుమార్ చేసేది కూడా అదే. జీవితం అనే రంగస్థలంలో ఎన్నో అనుభవాలు ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి. ఆ విషయాన్నే తెరపై చూపించనున్నాడు. మరి ఎంతవరకు మనకు కనెక్ట్ అవుతుందో చూద్దాం.