Begin typing your search above and press return to search.

రంగస్థలం అసలు రంగు ఏమిటో?

By:  Tupaki Desk   |   25 Oct 2017 11:05 PM IST
రంగస్థలం అసలు రంగు ఏమిటో?
X
టాలీవుడ్ దర్శకుల్లో తన ఆలోచనను కరెక్ట్ గా తెరపై చూపించే వారిలో సుకుమార్ ఒకరని చెప్పాలి. అయతే అప్పుడపుడు తాను ప్రేక్షకులను ఎక్కువగా కన్ఫ్యూజన్ చేస్తాను అనే ఒక టాక్ ఉందని సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. అదే విధంగా నెక్స్ట్ తీయబోయే రంగస్థలం 1985 సినిమాలో మాత్రం ఆ విధంగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదని సీన్ టూ సీన్ చాలా క్లియ్యర్ గా ఉంటుందని కూడా చెప్పాడు.

కానీ సినిమా ఫొటోస్ తో మాత్రం ఈ దర్శకుడు విడుదలకు ముందే కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. సినిమా కోసం వేసిన ఒక విలీజ్ సెట్ లోని పోటోలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తూ ప్రేక్షకులకు ఓ విధంగా ఆసక్తిని రేపుతున్నాడు హీరో రామ్ చరణ్‌. ఆ దెబ్బతో సుకుమార్ ఏం చేస్తున్నాడోనని కన్ఫ్యూజన్ లో కూడా పడేస్తున్నాడు. చెర్రీతో ఏం ప్రయోగం చేస్తున్నాడో గాని ఇటీవల 1985లో కనబడిన సోడా బుడ్లు - గోల్డ్ స్పాట్ కూల్ డ్రింక్ అలాగే దుకాణంలో కనిపించే చిరు తిండ్లు మరియు ఎడ్లబండి పోటోలను చూపించి సినిమా పై అంచనాలను పెంచి పాజిటివ్ అనుమానాలను కలిగిస్తున్నాడు.

ఇక రీసెంట్ గా మరో మంచి ఫోటోని చరణ్‌ బయటపెట్టాడు. ఏదైనా ఉత్సవాలు జరిగితే దసరా పండుగకు వేసుకునే పగటి వేషాలతో కూడిన ఆర్టిస్టులు సెట్స్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫిక్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. అలాగే పూర్తిగా సుకుమార్ గ్రామ నేపథ్యంలో చిత్రాన్ని తీస్తున్నాడని కొందరు అంటుంటే మరికొందరు అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతోంది. అసలు రంగు ఏంటీ అని చెవులు కొరక్కుంటున్నారు. చూద్దాం చరణ్‌ అండ్ సుక్కు వచ్చే ఏడాది ఏం చూపిస్తారో!!