Begin typing your search above and press return to search.
రంగస్థలం 1985.. అలా ఉంది ప్లాన్
By: Tupaki Desk | 29 Nov 2017 7:50 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను తీసి ఇన్ని రోజులు మంచి హిట్స్ అందుకున్నాడు. కాని కొన్ని ప్రయోగాలు మాత్రం మెగా హీరోకి నిరాశను మిగిల్చాయి. ఎక్కువగా బాక్స్ ఆఫీస్ హిట్ చిత్రాలను అందుకున్నా కూడా ఒక నటుడికి ప్రయోగాత్మకమైన సినిమా తీస్తేనే సంతృప్తిగా ఉంటుంది. ప్రస్తుతం అదే అనుభూతిలో మునిగి తెలుస్తున్నది రామ్ చరణ్. తన స్టార్ ఇమేజ్ ని సైతం పక్కనపెట్టి ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు.
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. పూర్తిగా గోదావరి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఏదైనా సినిమాలో ఒకటో రెండో హైలెట్ గా చెప్పుకునే విషయాలు ఉంటాయి. కానీ సినిమా మొత్తం హైలెట్ అని గుర్తింపు తెచ్చుకునే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు రంగస్థలం సినిమాకు కూడా అదే గుర్తింపు లభిస్తోంది. ఇక సినిమా ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా ఫస్ట్ లుక్ ని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ను మొదలు పెట్టి పూర్తి చేయాలనీ అనుకుంటోంది సుకుమార్ టీమ్. అలాగే డిసెంబర్ లోనే సినిమాలోని నాలుగు పాటలను షూట్ చేయాలనీ ఆలోచిస్తున్నారు. వీలైనంత త్వరగా ఫిబ్రవరి లోపు సినిమాను మొత్తం రెడీ చేసి ఫైనల్ గా మార్చ్ 16న సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది.