Begin typing your search above and press return to search.
రంగస్థలం.. అక్కడ రచ్చ మొదలైంది
By: Tupaki Desk | 29 March 2018 5:50 AM GMTరామ్ చరణ్ సినిమా వచ్చిందంటే చాలు.. థియేటర్ల దగ్గర అభిమానులు రచ్చ రచ్చ చేసి పారేస్తుంటారు. మెగా ఫ్యాన్స్ హంగామా పీక్ స్టేజ్ కి చేరిపోతూ ఉంటుంది. బీ సీ వంటి వంటి మాస్ సెంటర్స్ లో మాత్రమే కాదు.. క్లాస్ ఏరియాస్ లో మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం మూవీ రేపు రిలీజ్ కానుండగా.. యూఎస్ లో ఇవాళ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయి.
మన దగ్గర అర్ధరాత్రి దాటుతుంది. ప్రీమియర్లకు అనూహ్య స్థాయిలో డిమాండ్ ఏర్పడడంతో అందుకు తగినట్లుగా స్క్రీన్ కౌంట్ పెంచుతున్నారు. ఒక్కో ఏరియాలను 10కి పైగా స్క్రీన్స్ ను అదనంగా యాడ్ చేయాల్సి వస్తోంది. మరోవైపు అభిమానులు అప్పుడే తమ హంగామా స్టార్ట్ చేసేశారు. రంగస్థలం టీషర్టులు వేసుకుని ఫోటోలు దిగి నెట్ లో పెట్టేయడం.. తాము బుక్ చేసుకున్న టికెట్స్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేసేస్తూ హంగామా చేసేస్తున్నారు. ఇంకోవైపు ప్రీ బుకింగ్స్ ట్రెండ్ కూడా ఊపందుకుంటోంది.
ఏఎంసీ.. రీగల్ సినిమాస్ ఇప్పటివరకూ ఆన్ లైన్ లో ఉంచిన స్క్రీన్స్ కు టికెట్స్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇఫ్పటికే లక్ష డాలర్ల ప్రీ బుకింగ్స్ జరిగాయని తెలుస్తోంది. సాయంత్రం షో టెలికాస్ట్ టైంకు స్క్రీన్ కౌంట్ పెరగనుండడంతో.. ఈ వసూళ్ల హంగామా రికార్డు స్థాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫొటోస్ కోసం క్లిక్ చేయండి