Begin typing your search above and press return to search.

రంగస్థలం సేఫ్ బడ్జెట్లోనే ఉందట

By:  Tupaki Desk   |   15 Oct 2017 10:38 AM GMT
రంగస్థలం సేఫ్ బడ్జెట్లోనే ఉందట
X
ఈ రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమాను తెరకెక్కించాలి అంటే మినిమామ్ 70 కోట్లు దాటి 100 కోట్ల వరకు బడ్జెట్ వెళుతోంది. ఒక్కోసారి స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఆ రేట్ ఇంకా పెరగొచ్చు. సినిమా బిజినెస్ బట్టి లేదా హీరో మార్కెట్ బట్టి బడ్జెట్ ముందే సెట్ అయినా ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల మరింత పెరిగే అవకాశం ఉంటోంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సందడి చేయలేకపోయాయి. అయితే ఒక స్టార్ హీరో సినిమా మాత్రం చాలా సేఫ్ బడ్జెట్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

రామ్ చరణ్ సరికొత్త పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తోన్న రంగస్థలం 1985 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే విడుదలకు ముందే చాలా సేఫ్ అని అందరు అనుకుంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ మొదట 50 కోట్లే అనుకున్నారు. కానీ 60 వరకు వెళ్లింది. ఎక్కువగా సెట్స్ కోసమే సుకుమార్ ఖర్చు చేయించడాని తెలుస్తోంది. ఇక రిలీజ్ తర్వాత కూడా ప్రీ రిలీజ్ - పబ్లిసిటీ కోసం మరో 5 కోట్లు అనుకున్నా మొత్తంగా 65 కోట్ల వరకు సినిమాకు ఖర్చు చేయాలి. కానీ ఈ సినిమా కి ఇది చాలా సేఫ్ బడ్జెట్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే శాటిలైట్ - డిజిటల్ రైట్స్ అలాగే ఇతర భాషల రైట్స్ తోనే మొత్తంగా రూ.35 కోట్ల వరకు సినిమా రిలీజ్ కు ముందే బిజినెస్ అవుతోంది.

ఇక సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద మొత్తంలోనే ఆఫర్ చేస్తారు. ముఖ్యంగా సీడెడ్ - ఆంధ్రాలో మెగా పవర్ స్టార్ కి మంచి మార్కెట్ ఉంది. అంతే కాకుండా నైజాంలో కూడా మెగా అభిమానులు చాలామందే ఉన్నారు. అలాగే కర్ణాటక లో కూడా మన స్టార్ హీరోల సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా చెర్రీ సినిమాలు బాగానే అడతాయి. మొత్తంగా లెక్కలేసుకుంటే రంగస్థలం రిజల్ట్ ఎలా ఉన్నా పెట్టిన బడ్జెట్ రావడంతో పాటు ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువనే వస్తాయని చెప్పాలి.