Begin typing your search above and press return to search.
ఆళ్లు మాస్ చూడరన్నది ఎవరెహ!!
By: Tupaki Desk | 2 April 2018 3:30 PM GMTఓవర్సీస్ లో జనాలు మాస్ సినిమాలు చూడరు. క్లాస్ కంటెంట్ అయితేనే వారికి ఎక్కుతుంది. కమర్షియల్ ఫార్ములా సినిమాలు.. పైటింగులు గట్రా ఉండే మూవీస్.. లాంటివి వారికి అసలు ఎక్కనే ఎక్కవు.. యూఎస్ ఆడియన్స్ పై ట్రేడ్ ఎక్స్ పెక్టేషన్స్ ఇలా ఉంటాయి. కొంత కాలం క్రితం వరకూ ఇదే నిజం అని అందరూ భ్రమ పడిపోయారు కూడా.
మెగా హీరోలు ఇది శుద్ధ తప్పు అని ప్రూవ్ చేసేస్తున్నారు. మొదటగా మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో.. ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. అంతే కాదు.. ఓవర్సీస్ లో ఓవరాల్ గా టాప్ 5 మూవీస్ లో స్థానం సంపాదించేశారు. పక్కా కమర్షియల్ మూవీకి ఇంతటి వసూళ్లు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. ఇప్పుడు రంగస్థలం మూవీతో రామ్ చరణ్ ఇంకా చాలా పెద్ద భారీ షాక్ నే ఇచ్చేశాడు. క్లాస్ సినిమాలు తీసే సుకుమార్ తో కలిసి మాస్ లోనూ బాగా నాటుగా అనిపించే కంటెంట్ తో రంగస్థలం మూవీ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసేశాడు.
పలు సినిమాలు యూఎస్ లో ఆపసోపాలు పడి ఫుల్ రన్ లో సాధించిన వసూళ్లను మూడంటే మూడు రోజుల్లో దాటేశాడు రామ్ చరణ్. మూడో రోజు ప్రారంభమైన కొన్ని గంటలకే ఈ చిత్రం 2 మిలియన్ల మార్క్ అందుకుంటే.. వీకెండ్ ముగిసేసరికి యూస్ టాప్ తెలుగు మూవీస్ ఛార్టులో 6వ స్థానాన్ని అందుకుంది. ఇదంతా చూస్తుంటే.. అక్కడి జనాలు మాస్ మూవీస్ మెచ్చరు అనే వాదనకు పూర్తిగా చెక్ పడిపోయిందని చెప్పచ్చు. కాకపోతే ఆ కంటెంట్ నే కాసింత క్లాసీ టచ్ తో చెప్పే ట్యాలెంట్ దర్శకుడికి ఉండాలంతే.