Begin typing your search above and press return to search.
100 కోట్ల 'గ్రాస్' క్లబ్బులో రంగస్థలం
By: Tupaki Desk | 3 April 2018 5:19 AM GMTసౌత్ ఇండియాలో గత కొన్ని సంవత్సరాల నుండి చూసుకుంటే.. అసలు 100 కోట్లు గ్రాస్ వసూలు చేసిన సినిమాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. ఏకంగా సంవత్సరానికి తెలుగులో తమిళంలో 300 సినిమాలు వస్తున్నా కూడా.. కేవలం 33 సినిమాలు మాత్రం 100 కోట్ల గ్రాస్ మార్కును దాటాయి. ఆ 33వ సినిమా ఏంటో తెలుసా? ఇంకేంటి.. మన రామ్ చరణ్ 'రంగస్థలం' అనే చెప్పాలి.
మూడు రోజుల్లో 50+ కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సుకుమార్ సినిమా.. ఇప్పుడు నాలుగు రోజు వసూళ్ళను కలుపుకుని ఏకంగా 63 కోట్ల షేర్ వసూలు చేసింది. కట్ చేస్తే.. నాలుగు రోజులకూ ఓవర్సీస్ వసూళ్ళను కూడా కలిపి గ్రాస్ లెక్కలు చూస్తే.. సినిమాకు 102 కోట్లు వచ్చిందట. అసలు నాలుగు రోజుల్లో 100 కోట్లు వసూలు చేయడం ఒక పెద్ద రికార్డ్. పైగా ఇప్పుడు చరణ్ వసూలు చేసిన నెంబర్ బాహుబలి 1 అండ్ 2 తరువాత అంత స్పీడుగా 100 కోట్లు వసూలు చేయడం ఈ సినిమాకే సాధ్యమైంది. తొలిరోజే మంచి టాక్ రావడం.. అన్ని సెంటర్లలో చరణ్ యాక్టింగ్ కేకలు అంటూ యునినిమాస్ రిపోర్టు రావడంతో.. సినిమా కలక్షన్లపై పాజిటివ్ నోటి మాటలు బాగా ప్రభావం చూపించేశాయి. అందుకే ఇప్పుడు సినిమాకు ఏకంగా 100 కోట్లు సునాయసంగా వచ్చేశాయి.
అయితే మొత్తంగా 80 కోట్లు ధియేట్రికల్ బిజినెస్ చేసిన రంగస్థంల.. ఆ మొత్తాన్ని ఖచ్చితంగా మొదటి వారం పూర్తయ్యేలోపు వసూలు చేస్తుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే మొన్న డాడ్ మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 100 కోట్ల షేర్ క్లబ్బులో ఖాతా తెరిచారు. కాని బాబాయ్ అజ్ఞాతవాసితో ఆ ఫీట్ అందుకోలేకపోయాడు. మరి చరణ్ ఇప్పుడు తన దాటిని కంటిన్యూ చేస్తూ.. 100 కోట్ల క్లబ్బులోకి ఎక్కుతాడా? వెయిట్ అండ్ సి.