Begin typing your search above and press return to search.
రంగస్థలం టీజర్ అంత పని చేసింది
By: Tupaki Desk | 27 Jan 2018 7:18 AM GMTరామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబినేషన్ పై ఎవరికైనా ఏమన్నా సందేహాలు గట్రా ఉంటే.. అవన్నీ ఒకేసారి పటాపంచలు అయిపోయాయ్. 'రంగస్థలం' టీజర్ రావడంతో.. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు తన మెగా పవర్ ఏంటో చూపించాడు. అంతేకాదు.. సదరు టీజర్‌ను రాజమౌళి నుండి అల్లు అర్జున్ వరకు.. పరుచూరి నుండి వంశీ పైడిపల్లి వరకు.. ఇలా చాలామంది హేమాహేమీలు మెచ్చేసుకున్నారు. ఇక జనాలు కూడా బాగా మెచ్చుకున్నట్లు ఇవిగో సాక్ష్యాలు.
నిజానికి మన తెలుగులో అత్యంత ఆదరణ పొందిన ట్రలైర్ టీజర్ అంటే.. ఖచ్చితంగా బాహుబలి గురంచే చెప్పాలి. ఏకంగా అప్ లోడ్ చేసిన 1 రోజులోనే.. అంటే 24 గంటల్లో.. ఏకంగా 1 కోటి వ్యూస్ వచ్చాయి. యుట్యూబ్ లోని రెండు మూడు ఛానల్స్ ను కలపుకుని ఇవి కుములేటివ్ వ్యూస్. ఆ తరువాత అంతటి ఫీట్ చేసిన టీజర్ అంటే.. మొన్న వచ్చిన అల్లు అర్జున్ ''నా పేరు సూర్య'' ఫస్ట్ ఇంపాక్ట్ అనే అనాలి. ఆ టీజర్ కు 29 గంటల్లో 1 కోటి వ్యూస్ వచ్చాయి. అయితే ఇప్పడు రంగస్థలం మాత్రం ఆ రెండోస్థానం తాలూకు లెక్కను మార్చేసింది.
మైత్రి మూవీస్ వారి అఫీషియల్ ఛానల్ లో ఇప్పటివరకు 7,998,251 views తెచ్చుకున్న ఈ టీజర్.. అసలు 25.5 గంటల్లో అన్ని ఛానల్స్ లో కలుపుకుని 1 కోటి వ్యూస్ తెచ్చేసుకుందట. ఆ లెక్కన చూస్తే బాహుబలి తరువాత ఇప్పుడు ఎక్కుమంది చూసిన టీజర్ గా రంగస్థలం లైన్లోకి వచ్చేసిందనమాట. మరి టీజర్ కే ఇలా ఉంటే ట్రైలర్ ఏం చేస్తుందో చూసుకోండి అంటున్నారు మెగాభిమానులు. సుకుమార్ డైరక్షన్లో రూపొందిన రంగస్థలం సినిమాను మైత్రి మూవీస్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అది సంగతి.