Begin typing your search above and press return to search.
వారిద్దరికీ తేడా ఎక్కడ వచ్చిందంటే
By: Tupaki Desk | 15 Feb 2018 4:33 AM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం రంగస్థలం రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండటంతో అందులోని విశేషాలను ఒక్కోటిగా బయటపెడుతూ వస్తున్నారు. ముందు రిలీజ్ చేసిన హీరో రామ్ చరణ్ టీజర్.. తరవాత హీరోయిన్ సమంతల ఫస్ట్ లుక్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.
తాజాగా ఈ మూవీలోని ఎంత సక్కగున్నావే రామలక్ష్మి పాట ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. హీరోయిన్ అందాన్ని పల్లె సొగసులతో పోలుస్తూ సాగిన ఈ పాట అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ పాట ఆడియోతో పాటు పాటకు సంబంధించిన సన్నివేశాలతో కనీసం రెండు నిమిషాల వీడియో కూడా విడుదల చేద్దామని హీరో రామ్ చరణ్ ప్లాన్ చేశాడు. ఇదే విషయమై డైరెక్టర్ సుకుమార్ పై కాస్త ఒత్తడి కూడా చేశాడని తెలిసింది. కానీ ఈ పాటలో సన్నివేశాలకు సంబంధించి డిజిటల్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో వీడియో విడుదల చేయడం కుదరదని సుకుమార్ తేల్చి చెప్పేశాడట.
ఎంత సక్కుగున్నావే ఆడియోతోపాటు వీడియో కూడా ఇచ్చి ఉంటే ఇంకా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చి ఉండేదనేది రామ్ చరణ్ ఫీలింగ్. డిజిటల్ వర్క్ అయ్యాకే పాట విడుదల చేద్దామని చెప్పినా సుకుమార్ వినలేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. దీంతో రామ్ చరణ్ కాస్త నొచ్చుకున్నా తరవాత సర్లెమ్మని సర్దుకుపోయాడట. రంగస్థలం మూవీకి సంబంధించిన ప్రతి విషయంలో అన్ని జాగ్రత్తలూ స్వయంగా తీసుకోవాలని రామ్ చరణ్ గట్టిగానే డిసైడ్ అయ్యాడనేది లేటెస్ట్ టాక్.