Begin typing your search above and press return to search.
దీపావళి అంటున్న చరణ్!!
By: Tupaki Desk | 20 Oct 2018 9:05 AM GMTరంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని మెగా ఫాన్స్ ఎదురు చూపులకు ఎంతకీ అడ్డుకట్ట పడటం లేదు. దసరాకు టైటిల్ అనౌన్స్ చేయటమో లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమో ఉంటుంది అనుకున్నారు కానీ అదేమీ జరగలేదు. ట్విటర్ వేదికగా కొందరు అభిమానులు నిర్మాత దానయ్య మీద బోయపాటి మీద ట్రాలింగ్ కూడా మొదలుపెట్టారు. వీటి వల్ల ప్రయోజనం లేదని తెలిసినా తమ బాధను కోపాన్ని ఇలా ప్రదర్శించేస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రమోషన్ ను దీపావళి నుంచి మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఆ రోజు టైటిల్ ప్రకటిస్తారా లేదా సర్ ప్రైజింగ్ గా చిన్న టీజర్ లాంటిది ఏదైనా వదులుతారా అనే క్లారిటీ మాత్రం లేదు. ఇది అయినా జరిగితే అంత కన్నా కావాల్సింది ఏముంది అంటున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి విడుదలలో ఎలాంటి మార్పు కానీ వాయిదా కానీ ఉండదు అని తేల్చిన నేపధ్యంలో ఎంత రామ్ చరణ్ సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిసిటీ చాలా ముఖ్యం.
అందులోనూ పోటీగా ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ కి కావాల్సినంత హైప్ వారానికో పోస్టర్ తో నటీనటుల లుక్స్ తో పెంచుకుంటూ పోతున్నారు. అదే టైంకి టార్గెట్ చేసిన దిల్ రాజు మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇవి చాలదు అన్నట్టు రజనీకాంత్ పెట్టా కూడా రేస్ లోకి వస్తుందట. సో చరణ్ దూకుడు పెంచాల్సిందే. వీర విధేయ రామ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ అధికారికంగా చెప్పలేదు. ఇదే ఖరారు అయ్యే సూచనలు జోరుగా ఉన్నాయి.