Begin typing your search above and press return to search.
చెర్రి ఆన్ ది వే : తారక్ ఎక్కడ ?
By: Tupaki Desk | 14 March 2019 5:46 AM GMTసోషల్ మీడియాలో రామ్ చరణ్ యాక్టివ్ గా లేకపోయినా అతని తరఫున సతీమణి ఉపాసన ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి మంచి హుషారు ఇస్తూ ఉంటారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ కోసం చరణ్ ఇంటి నుంచి బయలుదేరుతూ ఉండగా వెనుక నుంచి చాలా తెలివిగా తీసిన పిక్ ని ఉపాసన షేర్ చేసుకుంది. పవర్ ప్యాక్ అయిన ఆర్ఆర్ఆర్ మీటింగ్ కోసం సర్వం సిద్ధమయ్యింది తను బయలుదేరాడు అని మీనింగ్ వచ్చేలా ఉపాసన పెట్టిన మెసేజ్ కి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ వచ్చేసింది.
ఎవరు హాజరవుతారు అనే అంచనాలకు మొదటి బ్రేక్ వేస్తూ చరణ్ రెడీ కావడాన్ని పెట్టిన వైఫ్ అఫ్ చెర్రి ఈసారి కూడా మొహాన్ని చూపకుండా జాగ్రత్త పడింది. అయినా ఎలాగూ ఇంకొన్ని నిమిషాల్లో రివీల్ చేయక తప్పదుగా. చరణ్ మంచి క్యాజువల్ వేర్ లో బయలుదేరాడు. వైట్ టి షర్టు తో సింపుల్ బ్లూ ప్యాంటుతో పాటు ఎండ నుంచి రక్షణ కోసమేమో క్యాప్ కూడా సిద్ధంగా ఉంచుకున్నాడు. సైడ్ నుంచి చూస్తే హెయిర్ స్టైల్ లో మార్పును గమనించవచ్చు.
మిలిటరీ తరహా పోలిస్ క్రాఫ్ తో చెర్రి ఏదో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నాడు. ప్రెస్ మీట్ కోసం సెటప్ చేసిన బిల్దప్ చూస్తుంటే ఈ రోజు చాలా విషయాల గురించి క్లారిటీ వచ్చేలా ఉంది. రామ్ చరణ్ సరే మరి మా హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అని అప్పుడే తారక్ ఫ్యాన్స్ వెయిటింగ్ లిస్టు పెరుగుతోంది. తారక్ నేరుగా ట్విట్టర్ లో అందుబాటులో ఉంటాడు కాని ప్రస్తుతానికి దీని గురించి ఇంకా ఏమి ట్వీట్ చేయలేదు