Begin typing your search above and press return to search.

మెగా వ‌ర్సెస్ అల్లు.. OTT వార్ షురూ?

By:  Tupaki Desk   |   5 July 2020 5:12 AM GMT
మెగా వ‌ర్సెస్ అల్లు.. OTT వార్ షురూ?
X
మ‌హ‌మ్మారీ క్రైసిస్ సినీప‌రిశ్ర‌మ‌ల‌కు ఎన్నో కొత్త పాఠాల్ని నేర్పిస్తోంది. ఇన్నాళ్లు సినిమా అంటే థియ‌ట‌ర్ల‌కు వెళ్లి చూసేది. కానీ ఇక‌పై ఆ ఆలోచ‌నే స‌రికాద‌నే స‌న్నివేశం నెల‌కొంది. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూడ‌డం పాత ప‌ద్ధ‌తి. నేరుగా ఇంటికే సినిమా రావ‌డం అన్న‌ది కొత్త విధానం. అందుకు డిజిట‌ల్- ఓటీటీ వేదిక‌లే ఆలంబ‌న అన్న భావ‌న యువ‌త‌రం స‌హా అంద‌రిలోనూ బ‌ల‌ప‌డుతోంది. మ‌హమ్మారీ మూడు నెల‌ల్లోనే ఈ కొత్త పాఠాన్ని ప్ర‌పంచానికి బాగా ఎక్కించింది. ఇప్ప‌టికే స్మార్ట్ ఫోన్లు.. స్మార్ట్ టీవీల‌కు అతుక్కుపోయి అమెజాన్- నెట్ ప్లిక్స్- డిస్నీ హాట్ స్టార్- జీ5 వంటి వేదిక‌ల‌పై సినిమాల వీక్ష‌ణ‌కు వెబ్ సిరీస్ ల వీక్ష‌ణ‌కు జ‌నం అడిక్ట్ అయిపోయారు. భ‌విష్య‌త్ వినోదం కేవ‌లం ఓటీటీ వేదిక‌లు యాప్ ల‌కే అంకితమైంద‌న్న దానిపై ప‌క్కాగా క్లారిటీ వ‌చ్చేసింది.

దీంతో టాలీవుడ్ లో ఉన్న బ‌డా నిర్మాత‌లు.. అగ్ర హీరోల క‌న్ను ప్ర‌స్తుతం ఓటీటీపై ప‌డింద‌ని తెలుస్తోంది. ప‌లువురు ఇప్ప‌టికే సొంత ఓటీటీ వేదిక‌ల ఏర్పాటు కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. భ‌విష్య‌త్ ఆశావ‌హ బిజినెస్ ని ముందే గెస్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే బాస్ అల్లు అర‌వింద్ సొంతంగా `ఆహా-తెలుగు` ఓటీటీని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఆయ‌న త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. కాంపిటీష‌న్ ని ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌ల్ని విస్త‌రిస్తున్నారు.

ఇప్ప‌టికైతే అల్లు అర‌వింద్ త‌ర్వాత ఓటీటీ వేదిక‌ల‌పై దిల్ రాజు- డి.సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్పుడు వీళ్లంద‌రికీ ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఎదురు కానుంది. తెలుగు ఓటీటీ వేదిక‌పై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌నాలు సృష్టించేందుకు భారీ ప్లాన్ తో ముందుకొస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ ప్రారంభించిన కొణిదెల ప్రొడ‌క్ష‌న్ హౌస్ గ్రాండ్ స‌క్సెస్ తో స‌త్తా చాటుతోంది. ఆ క్ర‌మంలోనే మెగా ఛ‌రిష్మాతో మెగా ఓటీటీని పెద్ద రేంజులో లాంచ్ చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నార‌ట‌.

పెద్ద తెర వార్ తో పాటు ఓటీటీ వార్ లోనూ మెగా హీరోల్ని నిల‌పాల‌న్న‌ది చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్‌ ప్లాన్. అందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఓటీటీ వేదిక స‌హా డిజిట‌ల్ స్మార్ట్ యాప్ ల ప్ర‌పంచంలో భ‌విష్య‌త్ క‌నిపిస్తుండ‌డంతో మెగా ఓటీటీకి స‌న్నాహాలు చేయ‌డం స‌రైన‌దేన‌నే అభిప్రాయం అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక వార్తా వెలువ‌డలేదు. తాజా క‌థ‌నాల‌పై చెర్రీ సోష‌ల్ మీడియాల్లో స్పందిస్తారేమో చూడాలి.