Begin typing your search above and press return to search.

భలే హ్యాండిల్ చేస్తావ్ చరణ్‌

By:  Tupaki Desk   |   4 Jun 2017 7:13 AM GMT
భలే హ్యాండిల్ చేస్తావ్ చరణ్‌
X
బయటకు చాలా దూకుడు స్వభావిగా కనిపించే మెగా హీరో రామ్ చరణ్.. వ్యక్తిగతంగా చాలా నెమ్మదస్థుడని అందరూ చెబుతుంటారు. పెద్దలన్నా.. సాటి నటి నటులన్నా.. చాలా అభిమానం ప్రేమ చూపిస్తాడని టాక్. అన్నింటి కన్న ముఖ్యంగా వాళ్ళ నాన్న మెగా స్టార్ చెప్పిన మాటను తూ.చ తప్పకుండ పాటించి అభిమానులు అంటే అమిత గౌరవమర్యాదలు చూపిస్తాడట. అందుకో అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు.

మొన్నమధ్యన తన కొత్త సినిమా షూటింగ్ టైమ్ లో కొందరు అభిమానులు వచ్చి కారుకి అడ్డం పడ్డితే వాళ్ళ మొరటు అభిమానం అర్ధంచేసుకొని కారు ఆపి వాళ్ళతో చాలా శాంతంగా వినయంగా మాటలాడి క్లాస్ పీకి పంపాడు చరణ్‌. మీరందరూ నా టైమ్ తెలుసుకుని చక్కగా ఒక గంట ముందు వస్తే.. హ్యాపీగా అందరం ఫోటోలో దిగేవారం కాని.. ఇలా కారుకు అడ్డుపడటం సమంజసం కాదన్నాడు. అంతే కాదు.. అభిమానులు సారీ అంటుండగా.. సరే వచ్చారు కాబట్టి ఫోటోలు దిగేసి వెళ్ళండి అని కూడా చెప్పాడు. స్టార్స్ షూటింగ్ వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉంటారు. అటువంటి అప్పుడు కొన్నిసార్లు వాళ్ళు చీకాకులో పడి ఎవరు పట్టనట్లు వెళ్లిపోతారు. అంతా మాత్రానేకే వాళ్ళకి పొగరు అభిమానులు అంటే లెక్కలేదు అనుకోవక్కర్లేదు. ఇదిగో చరణ్‌ ను చూస్తే అర్దమవుతోందిగా. భలే హ్యాండిల్ చేశాడు.

ప్రస్తుతం యురోప్ టూర్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్‌.. త్వరలోనే ఇండియా వచ్చి సుకుమార్ సినిమా షూటింగ్ ను తిరిగి పట్టాలెక్కించనున్నాడు. అప్పటికి సమంత కూడా తన చెయ్ తో కలసి తన బ్యాంకాక్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చేయనుంది. అది సంగతి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/