Begin typing your search above and press return to search.

నిర్మాత గాయాలకు చరణ్ మందు

By:  Tupaki Desk   |   9 Nov 2017 7:26 AM GMT
నిర్మాత గాయాలకు చరణ్ మందు
X
రామ్ చరణ్ ఇటు మెగా పవర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా అవతారం ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికై ఖైదీ నంబర్ 150ని నిర్మించిన చెర్రీ.. ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి అంటూ భారీ బడ్జెట్ తో మరో చిత్రం తీయనున్నాడు.

అయితే.. చరణ్ ఇలా నిర్మాతగా అవతారం ఎత్తకముందు నుంచే ప్రొడక్షన్ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాడని అంటారు. గోవిందుడు అందరివాడేలే చిత్రం టైం నుంచి ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతీ వ్యవహారాన్ని పట్టి పట్టి చూస్తున్నాడనే టాక్ ఉంది. ఇదంతా నిర్మాతల సేఫ్టీ కోసమే కావడం మరీ విశేషం. సినిమాకి అనుకున్న బడ్జెట్ పరిమితి మించితే.. ఆ మేరకు థియేట్రికల్ రైట్స్ ను ఎక్కువ విక్రయించే పద్ధతి మన దగ్గర ఫాలో అవుతారు. కానీ చరణ్ మాత్రం ఇలా కాకుండా.. తన పారితోషికం నుంచే కొంత తగ్గించుకుని.. నిర్మాతకు.. డిస్ట్రిబ్యూటర్లకు భారం లేకుండా చూస్తున్నాడట.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం విషయంలో ఇదే ఫాలో అవుతున్నాడట చరణ్. ఈ చిత్రాన్ని మొదట కోనసీమ అందాల మధ్య తీయాలని భావించారు. కానీ అక్కడ జనాల హంగామా కారణంగా షూటింగ్ సాగలేదు. దీంతో హైద్రాబాద్ లోనే రంగస్థలం ఊరి సెట్ వేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఓ ఐదారు కోట్ల మేర బడ్జెట్ పెరిగిందట. ఇందులో కొంత తాను భరించడమే కాకుండా.. సుకుమార్ ని కూడా కొంత తగ్గించుకోవాల్సిందిగా కోరాడట చెర్రీ. నిర్మాతల హీరోగా చరణ్ ని మేకర్స్ తెగ పొగిడేస్తున్నారు.