Begin typing your search above and press return to search.

2 కోట్ల కోసం అలా దిగజారను - చరణ్

By:  Tupaki Desk   |   8 May 2019 6:05 AM GMT
2 కోట్ల కోసం అలా దిగజారను - చరణ్
X
ఇటీవలే కోకాపేటలో జరిగిన సైరా అగ్ని ప్రమాదం గురించి రకరకాల వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ అనే టాక్ వచ్చినప్పటికీ పోలీస్ అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది. విచారణ సాగుతోంది. అయితే షూటింగ్ చివరి దశలో జరిగిన ఘటన కావడంతో ఇన్సూరెన్స్ కోణంలో ఓ మీడియా వర్గంలో దీని గురించి ప్రచారం జరిగింది. దీని మీద చరణ్ రెస్పాండ్ అయ్యాడట.

వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్న తనకు ఆఫ్ట్రాల్ ఓ రెండు మూడు కోట్ల కోసం సెట్ ను తగులబెట్టి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదని దీన్ని తన దృష్టికి తెచ్చిన సన్నిహితులతో అన్నట్టు వినికిడి. అలా చేస్తే తనకంటే నాన్నకే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటివి ఎన్నడూ చేయను అని స్పష్టం చేశాడట.

సో సైరా మంటలు ఇంకో రకంగా కూడా చిచ్చు పెట్టాయన్న మాట. ఇంకొంత బాలన్స్ పార్ట్ తప్ప దాదాపు పూర్తయిన సైరా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్లనుంది. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగడం సహజమే అయినప్పటికీ సెట్లు కాలిపోయినప్పుడు ఇలాంటి ప్రచారాలు జరగడం కూడా అంతే మాములు. అందుకే సైరా యాక్సిడెంట్ గురించి అలాంటి కథనాలు వచ్చాయి. దసరా విడుదలను ప్లాన్ చేసినప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అంత ఈజీగా సాధ్యపడేలా లేదు. ఒకవేళ మిస్ అయితే దీపావళికి వెళ్తారో లేక వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తారో వేచి చూడాలి