Begin typing your search above and press return to search.

ఆమెతో గొడవలేమీ లేవన్న చరణ్

By:  Tupaki Desk   |   1 July 2018 9:30 AM GMT
ఆమెతో గొడవలేమీ లేవన్న చరణ్
X
టాలీవుడ్లో చాలా త్వరగానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. అతడికి మంచి మార్కెట్ ఏర్పడింది తెలుగు రాష్ట్రాల్లో. తన ఇమేజ్ పెంచుకుని.. మార్కెట్ విస్తరించుకోవడానికి కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్లో ఒక సినిమా చేయడానికి తయారైపోయాడు. ఆ చిత్రమే.. జంజీర్. అప్పటికి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంక చోప్రా ఇందులో అతడికి జోడీగా నటించింది. ఐతే చరణ్ కు.. ఆమెకు ఆ చిత్ర షూటింగ్ సందర్భంగా పడలేదని.. ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో బోలెడన్ని రూమర్లు వచ్చాయి. చరణ్ ను ఒక కొత్త వాడిలాగా ప్రియాంక ట్రీట్ చేసిందని.. అతను షూటింగులకు లేటుగా రావడం పట్ల ఆమె చాలా అసంతృప్తి వ్యక్తం చేసిందని గుసగుసలు వినిపించాయి.

ఐతే ఈ రూమర్లపై ఇటు చరణ్ కానీ.. అటు ప్రియాంక కానీ ఎప్పుడూ స్పందించలేదు. పైగా ‘జంజీర్’ డిజాస్టర్ కావడంతో దీనిపై ఆ తర్వాత అసలే డిస్కషనే లేకపోయింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో చరణ్.. ప్రియాంకతో తన సంబంధాలపై ఓపెనయ్యాడు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రియాంక చాలా ప్రొఫెషనల్ అని.. అందమైన నటి అని కితాబిచ్చాడు చరణ్. ఆమెతో మళ్లీ నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అది జరగాలని కోరుకుంటానని చరణ్ చెప్పాడు. ఈ మాట చెప్పడం ద్వారా ‘జంజీర్’ టైంలో ప్రియాంకతో ఏ గొడవా లేదని చెప్పకనే చెప్పాడు రామ్ చరణ్. ఐతే ప్రియాంకతో మళ్లీ పని చేయాలన్న చరణ్ కోరిక నెరవేరడం మాత్రం కష్టమే. అమెరికన్ టీవీ సిరీస్.. హాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయిన ప్రియాంక బాలీవుడ్ సినిమాల్లో నటించడమే తగ్గించేసింది. కొత్తగా సల్మాన్ ఖాన్ సినిమాను మాత్రమే ఒప్పుకుంది. చాలామంది హీరోలు.. దర్శకులకు ఆమె దొరకట్లేదు. అయినా చరణ్ కు మళ్లీ బాలీవుడ్లో నటించే ఉద్దేశాలున్నట్లే కనిపించడం లేదు కాబట్టి.. ప్రియాంకతో అతను మళ్లీ జట్టు కట్టడం కష్టమే.