Begin typing your search above and press return to search.

మెగా 151.. చెర్రీ అదొక్కటి దాచేశాడు

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:57 AM GMT
మెగా 151.. చెర్రీ అదొక్కటి దాచేశాడు
X
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇంకా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. మెగాస్టార్ స్టామినా ఏంటో చూపించింది. ఖైదీ నంబర్ 150తో ప్రొడ్యూసర్ గా అవతరించిన రామ్ చరణ్.. ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నెక్ట్స్ మూవీకి రెడీ అయిపోతున్నాడు.

'నేను సినిమా తీయాలన్నది అమ్మ కల. ఆమె భర్తనే హీరోగా చేసి సినిమా తీయడం కంటే.. సంతృప్తి ఇచ్చే విషయం ఏముంటుంది'అన్న రామ్ చరణ్.. మెగా 151పై కూడా చెప్పేశాడు. '151వ సినిమాకి నిర్మాతగా నాన్నగారే నన్ను ఎంచుకున్నారు. దీన్ని నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. మంచి కథతో ఏ నిర్మాత ముందుకు వచ్చినా.. సినిమాలు చేయడానికి ఆయన రెడీ' అని చెప్పిన చెర్రీ.. 'సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ మా అందరికీ విపరతీంగా నచ్చేసింది. అందుకే మెగాస్టార్ 151వ సినిమాను తన దర్శకత్వంలోనే తీయబోతున్నాం' అన్నాడు.

'ఫిలిం మేకింగ్ లో తన స్టైల్ ఏంటో ఇప్పటికే ధృవతో సూరి ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే సురేందర్ రెడ్డితోనే చేయనున్నాం. ఇంట్లో అయినా.. బయట అయినా.. నాన్నగారితో కలిసి పనిచేయడం అంటే.. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే' అని కూడా చెప్పిన రామ్ చరణ్.. అసలు ఆ కథ ఏంటి.. ప్రాజెక్ట్ ఏంటి.. సబ్జెక్ట్ ఏంటి అనే సంగతులు మాత్రం చెప్పలేదు. ఇప్పటికే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సబ్జెక్ట్ నే చిరు 151గా తెరకెక్కించబోతున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నా.. ఆ విషయం మాత్రం చెర్రీ కన్ఫాం చేయలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/