Begin typing your search above and press return to search.
ఆచార్య కోసం చెర్రీకి లైన్ క్లియర్ చేస్తున్నాడా?
By: Tupaki Desk | 6 Jun 2020 4:15 AM GMTRRR చిత్రీకరణ పూర్తయితే తదుపరి `ఆచార్య` షూటింగులో జాయిన్ అయ్యేందుకు చరణ్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి అల్లూరి సీతారామరాజు సన్నివేశాలు ఆసాంతం పూర్తయితేనే చెర్రీ వేరొక సెట్ కి వెళ్లేందుకు వెసులుబాటు దొరుకుతుంది.
కానీ చరణ్ పై ఇంకా కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించాల్సి ఉందిట. అందుకే ఇప్పుడు సెట్స్ కెళ్లిన వెంటనే తొలిగా చరణ్ పై సన్నివేశాల్ని పూర్తి చేసేందుకు రాజమౌళి ఏర్పాట్లలో ఉన్నారట. కేవలం 50 మంది కాస్ట్ అండ్ క్రూతో మాత్రమే చిత్రీకరణ చేయాలన్న నిబంధన ఉంది కాబట్టి ఆ రూల్ పాటిస్తూనే షూటింగును పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్న చరణ్ 20 నిమిషాల నిడివిలో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. దర్శకరచయిత కొరటాల ఈ పాత్రను డిజైన్ చేయడం కోసం ఎంతగానో రీసెర్చ్ చేశారట. దేవాలయ శాఖ కుంభకోణం .. నక్సలిజం.. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ .. ఇలా పలు కోణాల్లో పొలిటికల్ సోషియో థ్రిల్లర్ గా ఈ మూవీని మలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అలానే చెర్రీ కెరీర్ బెస్ట్ రోల్ పోషిస్తారన్న ముచ్చటా సాగుతోంది.