Begin typing your search above and press return to search.

RRRలో చ‌ర‌ణ్ రోల్ ఇదే

By:  Tupaki Desk   |   8 Jan 2019 11:49 AM GMT
RRRలో చ‌ర‌ణ్ రోల్ ఇదే
X
గ‌త కొంత‌కాలంగా ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రం క‌థ గురించి, ఇందులో చ‌ర‌ణ్, తార‌క్ పాత్ర‌ల గురించి అభిమానుల్లో ఒక‌టే ఉత్క ంఠ నెల‌కొంది. క్రీడాకారులుగా న‌టిస్తార‌ని, బాక్స‌ర్లు అని దొంగా పోలీస్ అని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే అవ‌న్నీ స్పెక్యులేష‌న్స్ మాత్ర‌మే. ఇంత‌కీ ఇందులో చ‌ర‌ణ్ పాత్ర ఏది? ఇదే విష‌యాన్ని `విన‌య విధేయ రామ` ఇంట‌ర్వ్యూలో చ‌ర‌ణ్ నే ప్ర‌శ్నిస్తే అత‌డి నుంచి ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ అందింది.

మ‌రోసారి డీగ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో న‌టిస్తున్నాను. ``ఎస్‌.ఎస్‌.రాజమౌళి మళ్లీ డి గ్లామరైజ్డ్ పాత్రనే సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా క‌నెక్ట‌వుతుంది. ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. 2019 మొత్తం ఈ సినీమాకే కేటాయించాను`` అని ఎగ్జ‌యిటింగ్ గా చెప్పారు. అలాగే ఎన్టీఆర్ తో క‌లిసి ప‌ని చేయ‌డం గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ చిత్రంలో మా ఇద్దరి కాంబినేషన్ సీన్లు చాలా బాగా వస్తున్నాయి. ఎన్టీఆర్ తో కలసి పనిచేస్తుండడం చ‌క్క‌ని అనుభూతిని ఇస్తోంది.. అని అన్నారు. రంగ‌స్థ‌లం త‌ర్వాత మ‌రోసారి చ‌ర‌ణ్ డీగ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో న‌టిస్తున్నార‌న్న సంగ‌తి మాత్ర‌మే రివీలైంది.

అన్ని జోన‌ర్ల‌లోనూ న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు.. అవును చేయాల‌నేదే నా ఉద్దేశమ‌ని చ‌ర‌ణ్ అన్నారు. 1980లో నాన్న గారు అన్ని జోనర్లలో సినిమా లు చేసి మెప్పించారు. జోనర్ కంటే కూడా ఒక సెన్సిబుల్ సినిమా చేయాలనుకున్నాను. అందుకే విన‌య విధేయ రామ లాంటి సినిమా ను అంగీకరించానన‌ని చ‌ర‌ణ్ తెలిపారు. ఇక సొంత బ్యాన‌ర్ లో సినిమాల గురించి ప్ర‌శ్నిస్తే.. అది కేవలం నాన్న గారి కోసం మాత్రమే పెట్టాను. అందులో నేను హీరోగా కూడా సినిమాలు చేయను. నాకు చాలా మంచి నిర్మాతలు వున్నారు. ప్రస్తుతానికైతే వేరే హీరోలతో సినిమాలు తీసే ఆలోచన లేదని చ‌ర‌ణ్ అన్నారు.